వాల్ నట్స్ ఇలా వాడితే చర్మం మెరిసిపోతుంది…ట్రై చేయండి
walnuts beauty benefits :వాల్ నట్స్ అంటే మనలో చాలామందికి ఆరోగ్య ప్రయోజనాల గురించి మాత్రమే తెలుసు కానీ వాల్ నట్స్ లో బ్యూటీ ప్రయోజనాలు కూడా దాగి ఉన్నాయి వాల్ నట్స్ లో మెగ్నీషియం జింక్ పాస్పరస్ మాంగనీస్ సెలీనియం ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పోలిక్ యాసిడ్ విటమిన్ బి విటమిన్ ఇ వంటివి సమృద్ధిగా ఉంటాయి. చలికాలం వచ్చేసింది చర్మం పొడిగా మారిపోతుంది చర్మం పొడిగా లేకుండా తేమగా ఉండాలంటే వాల్ నట్స్ ని పొడిగా చేసుకుని ఆ పొడిలో తేనె కలిపి ముఖానికి రాసి రెండు నిమిషాలు సున్నితంగా మసాజ్ చేసి పావుగంట అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే చర్మం తేమగా మారి మృదువుగా యవ్వనంగా ఉంటుంది.
నల్లని మచ్చలు మొటిమలు పోవాలంటే వాల్ నట్స్ తో ఈ ప్యాక్ తయారు చేసుకోవాలి. వాల్ నట్స్ పొడిలో రోజ్ వాటర్ నిమ్మరసం కలిపి ముఖానికి రాసి అరగంటయ్యాక గోరు వెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఈ ప్యాక్ ని వారంలో రెండు సార్లు వేసుకుంటే సరిపోతుంది.