నాగ చైతన్య లవ్ స్టోరీ బడ్జెట్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

love story movie naga chaitanya : అక్కినేని వారసుడు నాగ చైతన్య సాయి పల్లవి జంటగా నటిస్తున్న లవ్ స్టోరీ సినిమా దాదాపు షూటింగ్ పూర్తి చేసుకుంది. నాగ చైతన్య ఇప్పటివరకు మీడియం రేంజ్ బడ్జెట్ సినిమాల్లో నటించాడు. తన కెరీర్ ప్రారంభించినప్పటి నుంచి తక్కువ బడ్జెట్ లో సినిమాలు చేస్తూ సేఫ్ సైడ్ లో ఉంటున్నాడు 2019లో వచ్చిన మజిలీ సినిమా కేవలం 20 కోట్ల రూపాయలతో నిర్మించారు.

ప్రస్తుతం లవ్ స్టోరీ సినిమాకు భారీ బడ్జెట్ పెట్టారని వార్తలు వస్తున్నాయి ఈ సినిమా నిర్మించడానికి 35 కోట్ల వరకు బడ్జెట్ పెట్టారట . మజిలీ సినిమా హిట్ తో మంచి ఊపు మీద ఉన్న నాగ చైతన్యదర్శకుడు శేఖర్ కమ్ముల హీరోయిన్ సాయి పల్లవి కావటంతో ఈ సినిమాపై అంచనాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. కరోనా కారణంగా కాస్త లేట్ కావటంతో బడ్జెట్ 35 కాస్త 38 కోట్లు అయినట్టు వార్తలు వస్తున్నాయి నాగ చైతన్య కెరీర్ లో పెద్ద బడ్జెట్ సినిమా అని చెప్పవచ్చు. ఈ సినిమాను సంక్రాంతి లేదా వేసవి సెలవుల్లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాడు