MoviesTollywood news in telugu

Punadhirallu movie:పునాది రాళ్లు సినిమా గురించి కొన్ని నమ్మలేని నిజాలు…

chiranjeevi Movies :ఎవరికైనా తొలిసినిమా అంటే అదో అనుభూతి.. అందునా ఇప్పుడు మెగాస్టార్ గా ఉన్న చిరంజీవి తొలిసినిమా విశేషాలంటే అందరికీ ఆసక్తే. 1978ఫిబ్రవరి 11న తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి సమీపంలోని గుమ్మళ్లదొడ్డి గ్రామంలో షూటింగ్. నలుగురు కుర్రాళ్ళు కాళ్ళు కడుక్కుని భోజనాలు చేసే సీన్. అందులో ఒకరి తల్లి సావిత్రి భోజనం వడ్డిస్తుంది.

పొలం పనులు చూసుకుని వచ్చాక జరిగే సీన్ అది. కానీ పొలం పనుల సీన్ ఇంకా షూట్ చేయలేదు. మిగతా ముగ్గురు కాళ్ళు కడుక్కుంటుంటే, అందులో వరప్రసాద్ అనే కుర్రాడు అక్కడున్న గడ్డిపోచలు మీద వీసుకుని దులుపుకుంటున్నట్లు ఉన్నాడు. ఇది చూసిన కెమెరామెన్ అతడిని దగ్గరకు పిలిచి నీలో స్పార్క్ నెస్ ఉంది. ఇదే కంటిన్యూ చేస్తే పెద్ద స్టార్ అవుతావు అన్నాడు. అదే నిజమైంది.

తెలుగు ఇండస్ట్రీని ఏలేవిధంగా మెగాస్టార్ అయ్యాడు. శివశంకర వరప్రసాద్ కొణిదెల తెరమీద చిరంజీవి అయ్యాడు. ఇతడి తొలిసినిమా పునాది రాళ్లు. నాటి పల్లెటూళ్లలో సామాజిక జీవనానికి అద్దంపట్టే సినిమా గా నిల్చింది. ఈ మూవీ డైరెక్టర్ రాజ కుమార్ ఉస్మానియాలో ఫిజికల్ ఎడ్యుకేషన్ పిజి చేసి, కొన్ని కాలేజీల్లో పనిచేసాడు. అయితే సినిమా పట్ల మోజుతో హైదరాబాద్ సదరన్ మూవీస్ కొడుకు రాజ్ కుమార్ కి ఫ్రెండ్ కావడంతో అతడి ద్వారా మలయాళీ సినిమా ఘర్ కుల్ మూవీ కి ఠాకూర్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరాడు.

ఇక తానే దర్శక నిర్మాతగా ఓ సినిమా తీయాలని భావించి, గ్రామాల్లో పెద్దలు సాగించే దురాగతాలపై యువకులు తిరగబడే ఓ కథ తయారుచేసుకున్నారు. బ్లాక్ అండ్ వైట్ లో పునాదిరాళ్ళు టైటిల్ తో సినిమా స్టార్టు చేసారు. కానీ కలర్ లో తీస్తేనే వర్కవుట్ అవుతుందని ఫ్రెండ్స్ చెప్పడంతో అప్పటికే హైదరాబాద్ లో తీసిన 4,5రీళ్లు పక్కన పడేసారు.

ఈలోగా విజయవాడకు చెందిన ఫజుల్లా హుక్ కలర్ లో తీస్తే ప్రొడ్యూస్ చేస్తానని చెప్పడంతో మళ్ళీ మొదలు పెట్టాలని తారాగణం ఎంపిక మొదలుపెట్టారు. సుధాకర్ ని తీసుకుంటే,అతడు తమిళ మూవీ హీరోగా ఛాన్స్ రావడంతో వెళ్ళిపోయాడు. దీంతో ఫిలిం ఇనిస్టిట్యూట్ లో శిక్షణ పొందుతున్న వరప్రసాద్ ని తీసుకున్నారు.

అయితే టైటిల్స్ లో ఏ పేరు వేసుకోవాలి అనే దానిపై ఇంట్లో చర్చ నడిచింది. అతడి పేరులోని ఏ పేరు కట్ చేసినా ఎవరో ఒక నటుడు అప్పటికే ఉండడంతో తనకు వచ్చిన కల గురించి తల్లి చెప్పాడు. ఓరోజు రామాలయంలో దణ్ణం పెట్టుకుంటుంటే, ఓ పాప వచ్చి, చిరంజీవి నువ్వు వెళ్తే, తలపులు వేయాలి అందట.

అప్పుడు తల్లి అంజనాదేవి నీవు ఆంజనేయ భక్తుడివి, ఆంజనేయుడికి మరోపేరు చిరంజీవే. ఆ పేరే పెట్టుకో అన్నారట. అలా చిరంజీవి తెరపై మెరిశాడు. ఇక ఓరోజు వర్షం కారణంగా షూటింగ్ ఆపేసారు. ఆరోజు డైరెక్టర్ రాజ్ కుమార్ కిటికీలోంచి బయటకు తొంగిచూసేసరికి చిరంజీవి డాన్స్ చేస్తూ కన్పించాడు.

దాంతో అతడి టాలెంట్ చూసి, ఓ సాంగ్ పెట్టాలనిపించి చీరకట్టించి మరీ ఓ సాంగ్ పెట్టారు. అలా వేసిన స్టెప్స్ అతడి జీవితంలో ఎదగడానికి మెట్లు అయ్యాయి. 1979లో సినిమా రిలీజయ్యాక సితార వారపత్రికలో పివిఆర్ శివకుమార్ రాసిన చిరు నటన బాలన్స్ తప్పకుండా ఉందని రాసారు. ఈ సినిమాలోని స్టిల్స్ ప్రేమ్ కుమార్ ద్వారా క్రాంతి కుమార్ కి చేరడంతో ప్రాణం ఖరీదులో చిరు సెలక్ట్ అయ్యాడు.

అయితే పునాదిరాళ్ళు జాప్యం కావడంతో ప్రాణం ఖరీదు ముందుగా విడుదలైంది. 7సినిమాల తర్వాత ఇది విడుదలైంది. ప్రసాద్ లాబ్స్ అధినేత దీనికి సాయం చేసారు. సినిమా రిలీజయ్యాక మంచి రెస్పాన్స్ వచ్చింది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.