Kitchenvantalu

Mullangi Sambar:ఈ టిప్స్ తో ముల్లంగి సాంబార్ చేస్తే నాలుగు ముద్దలు ఎక్కువే తింటారు

Mullangi Sambar Recipe: సాంబార్ లేకుండా ఆంధ్ర వంటకాలు అసంపూర్ణమనే చెప్పాలి.అన్ని కూరగాయలతో చేసుకునే సాంబార్ Radish తో ట్రై చేయండి.ఆ టేస్ట్ అదో రేంజ్ లో ఉంటుంది.

కావాల్సిన పధార్ధాలు
కందిపప్పు- 1 కప్పు
నీళ్లు- 3 కప్పులు
పసుపు- ½ టీ స్పూన్
ఇంగువ – ¼ టీ స్పూన్
సాంబార్ కోసం
నూనె- 2 టేబుల్ స్పూన్స్
ఆవాలు – 1 టీ స్పూన్
ఎండుమిర్చి- 4
జీలకర్ర- 1 టీస్పూన్
వెల్లుల్లి- 7-8
కరివేపాకు- 2 రెబ్బలు
ఉల్లిపాయ ముక్కలు- 2
పచ్చిమిర్చి ముక్కలు- 3
ముల్లంగి ముక్కలు- 200 గ్రాములు
టమాటో ముక్కలు- 1 కప్పు
ధనియాల పొడి- 1 టేబుల్ స్పూన్
కారం – 1 టేబుల్ స్పూన్
చింతపండు పులుసు – ½ కప్పు
సాంబార్ పొడి- 1 టేబుల్ స్పూన్
కొత్తిమీర- చిన్న కట్ట
పచ్చికొబ్బరి తురుము- ¼ కప్పు
నీళ్లు – 750 ml

తయారి విధానం
1.కుక్కర్ లోకి నానబెట్టుకున్న కందిపప్పు వేసి పసుపు ,ఇంగువ,నీళ్లు పోసి మీడియం ఫ్లేమ్ పై 5-6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి.
2.స్టవ్ పై వేరొక గిన్నెలో నూనె వేడి చేసి అందులోకి ఆవాలు,ఎండుమిర్చి,జీలకర్ర ,వెల్లుల్లి,కరివేపాకు వేసి వేపుకోవాలి.
3.వేగిన తాలింపులో ఉల్లిపాయ చీలికలు,ఉప్పు వేసి బాగా కలిపి మేడు నిమిషాలు మూతపెట్టుకోని మగ్గనివ్వాలి.
4.మగ్గిన ఉల్లిపాయల్లో ముల్లంగి ముక్కలు,పచ్చిమిర్చి వేసి బాగా మగ్గనివ్వాలి.

5.మగ్గిన ముల్లంగిలో కారం ,ధనియాల పొడి ,కాసిన్ని నీళ్లు పోసి వేపుకోవాలి.
6.వేగిన కారంలో టమాటొ ముక్కలు ,చింతపండు రసం వేసి బాగా మరగనివ్వాలి.
7.మరుగుతున్న పులుసులో మెత్తగా ఉడికించి పెట్టుకున్న పప్పును వేసి బాగా కలిపి హై ఫ్లేమ్ పై మరగనివ్వాలి.
8.మరుగుతున్న సాంబార్లో పచ్చికొబ్బరి తురుము,సాంబార్ పొడి,కొత్తిమీర తరుగు వేసి కలిపి మూతపెట్టుకోని లో ఫ్లెమ్ పై నలబై నిమిషాలు మరగనివ్వాలి.
9.అంతే ఘుమ ఘుమ లాడే ముల్లంగి సాంబార్ రెడి అయినట్టే.
Click Here To Follow Chaipakodi On Google News