Movies

దర్శకేంద్రుని సినిమాపై జోరుగా చర్చ- హీరోయిన్స్ ఎవరో తెలుసా ?

Raghavendra Rao Movies :టాలీవుడ్ లో దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు 100కు పైగా సినిమాలు డైరెక్ట్ చేసి, ఎందరో హీరోల కెరీర్ నిలబెట్టాడు. మహేష్ బాబు, అల్లు అర్జున్, శ్రీకాంత్ , ఇలా ఎందరినో లాంచ్ చేసి ఇండస్ట్రీ లో నిలబడేలా చేసారు. ప్రస్తుతం 78 ఏళ్ల వయసులో ముఖానికి మేకప్ వేసుకోబోతున్నారు. రాఘవేంద్రరావు చుట్టూ తిరిగే ఓ స్టోరీలో ఆయన ముఖ్యపాత్ర పోషించబోతున్నారు.

ప్రముఖ రచయిత, నటుడు, దర్శకుడు తనికెళ్ల భరణి దర్శకత్వం వహించనున్న ఈ మూవీ పూర్తి కమర్షియల్ హంగులతో రాబోతోందని అంటున్నారు. అంతేకాదు, ఈ మూవీలో ఏకంగా నలుగురు హీరోయిన్లు నటించనున్నారు. ఇప్పటికే ముగ్గురు హీరోయిన్లు ఒకే అయ్యారట. సమంత, శ్రియ, రమ్యకృష్ణలు కూడా ఈ సినిమాలో నటించడానికి ఒకే చెప్పారట.

రమ్యకృష్ణకు గ్లామరస్ ఇమేజ్ తెచ్చిన ఘనత రాఘవేంద్రరావు నటించే సినిమాలో ఆమె నటించడం ఓ విశేషం. టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత ఒకే చెప్పడం మరో విశేషం. శ్రియ కూడా ఈ సినిమాలో మరో కీలక పాత్ర పోషిస్తుండగా, ఇక నాలుగో హీరోయిన్ ఎవరా అని చర్చ నడుస్తోంది. మొత్తానికి నలుగురు హీరోయిన్స్ తో దర్శకేంద్రుడు నటించే సినిమా ఇండస్ట్రీలోనే కాదు, జనంలో కూడా ఆసక్తి రేపుతోంది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."