మెగా డాటర్ నిహారిక పెళ్లి ఖర్చు ఎంతో తెలుసా ?
Niharika Marriage :కొణిదెల వారింటి గారాలపట్టి, మెగా డాటర్, సినీ నటి నిహారిక వివాహం రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్ ప్యాలెస్ లో అంగరంగ వైభవంగా జరిగింది. బుధవారం రాత్రి జొన్నలగడ్డ వెంకట చైతన్య, నిహారికల పెళ్లి కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితుల సమక్షంలో నిర్వహించారు. మెహందీ, సంగీత్, హల్దీ ఇలా పలు రకాల కార్యక్రమాల మేళవింపుతో మూడు రోజులపాటు సందడి గా ఈ పెళ్లి సాగింది. నిజానికి ఒకప్పుడు పెళ్లంటే, తప్పట్లు, తాళాలు, తలంబ్రాలు అని అనుకునేవాళ్లం.
కానీ ఇప్పుడు ట్రెండ్ ఏమిటంటే, అయినవాళ్లను, దగ్గరవాళ్లను మూడు రోజులపాటు దూరంగా ఎక్కడికైనా తీసికెళ్ళి వివిధ రకాల హంగామాలతో సందడిగా పెళ్లి జరిపించడం గా మారింది. అందులో భాగంగానే గీత్, సంగీత్, మెహందీ వంటి వేడుకలన్నీ చోటుచేసుకుంటున్నాయి. తాజాగా నిహారిక పెళ్లి కూడా ఇలానే జరిగింది. కొణిదెల, అల్లువారి కుటుంబం, పెళ్లి కొడుకు తరపు జొన్నలగడ్డ ఫామిలీ ఈ వేడుకలో పాల్గొని సందడి చేసారు.
ఇక ఈమె పెళ్ళికి ఎంత ఖర్చయిందనేది ఒక చర్చ నడుస్తోంది. ప్రపంచంలోనే విలాసవంతమైన వేదిక ఉదయ్ ప్యాలెస్. అలాంటప్పుడు ఖర్చు కూడా బాగానే అవుతుంది. 400ఏళ్ల క్రితం నిర్మించిన రాజ్ పుత్ ల ప్యాలెస్ కాంప్లెక్స్ ఇది. కొండపై కట్టిన ఈ ప్యాలస్ మేఘాల శైలిలో నిర్మించారు. ఇక్కడ అద్దె 60లక్షలు. అలంకరణలు అన్నీ చూస్తే, కోటి వరకూ అవుతుంది. ఇక ప్రత్యేక విమానాల్లో బంధువులను, స్నేహితులను కల్పి 150మంది వరకూ తీసుకొచ్చారు. ఇవన్నీ కలిపితే, దాదాపు 5కోట్ల వరకూ వెచ్చించినట్లు టాక్. ఈ ఖర్చంతా వరుణ్ తేజ్ భరించినట్లు టాక్.

