ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తో ఎంట్రీ ఇచ్చిన భామలు Part-1
Family Background Heroines :బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ అనే బేధం లేకుండా అన్ని ఇండస్ట్రీల నుంచి బ్యాక్ గ్రౌండ్ తో వచ్చి తమ టాలెంట్ ను నిరూపించుకొని స్టార్లుగా ఎదిగిన వాళ్లలో మొట్టమొదటిగా నటి సుహాసిని గురించి చెప్పాలి. ఆమె తండ్రి చారుహాసన్ తమిళ్ లో పేరు పొందిన నటులు. ఇటీవల విడుదలైన డియర్ కామ్రేడ్ లో హీరో తాత పాత్రలో నటించారు. పైగా చారుహాసన్ స్వయంగా కమల్ హాసన్ కి సొంత అన్నయ్య. ఇక కమల్ హాసన్ కూతుళ్లలో శృతిహాసన్ హిందీ, తెలుగు, తమిళ సినిమాల్లో నటించి తనకంటూ ఓ పేరు తెచ్చుకుంది. అలాగే మరో కూతురు అక్షర హాసన్ హిందీలో రెండు సినిమాలు చేసింది తర్వాత తమిళ్ లో అజిత్ నటించిన వివేకం లో ఒక ముఖ్య పాత్ర పోషించింది. తర్వాత తన తండ్రి నిర్మాణంలో వచ్చిన కదరం కొండాన్ లో హీరోయిన్ గా చేసింది.
బాలీవుడ్ లో కరిష్మా కపూర్, కరీనా కపూర్ ల తండ్రి రణధీర్ కపూర్ ఒకప్పుడు బాలీవుడ్ లో పెద్ద యాక్టర్. తర్వాత కరిష్మా సినిమాల్లోకి వచ్చింది. కొన్నాళ్ళకి కరీనా కూడా బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు పెద్ద స్టార్ అయింది. అలాగే హిందీలో గొప్ప నటులైన పంకజ్ కపూర్ కూతురు సనా కపూర్ షాన్దార్ సినిమాలో చేసింది. ఆ సినిమాలో పంకజ్ కి కూతురుగా నటించింది. ప్రముఖ బాలీవుడ్ నటుడు రాజేష్ కన్నా కూతురు ట్వింకిల్ ఖన్నా కూడా బాలీవుడ్ లో ఎన్నో సినిమాల్లో నటించింది. తెలుగులో శ్రీను సినిమా లో వెంకటేష్ కి జోడీగా నటించింది. ఇక చంకీ పాండే కూతురు అనన్య పాండే బాలీవుడ్ లో స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 సినిమాతో ఎంట్రీ ఇచ్చి, తర్వాత పతి పత్ని ఔర్ వహ్ సినిమాలో నటించింది.
ఇప్పుడు పూరీ జగన్నాథ్, విజయ్ దేవరకొండ కాంబినేషన్లో వచ్చే సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తోంది. హిందీలో షాట్ గన్ అని పేరు తెచ్చుకున్న శత్రుఘ్నసిన్హా కూతురు సోనాక్షి సిన్హా.. దబంగ్ మూవీతో ఎంట్రీ ఇచ్చి, తర్వాత ఎన్నో హిందీ సినిమాలు చేసింది. తమిళ్ లో రజినీకాంత్ తో లింగా సినిమాలో కూడా నటించింది. ప్రస్తుతం హిందీ సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. బాలీవుడ్ స్టార్ హీరో గోవింద కూతురు టీనా అహుజా అసలు పేరు నర్మద. టీనా గా మార్చుకుని 2015లో సెకండ్ హ్యాండ్ హస్బెండ్ అనే మూవీతో హిందీ సినిమా ఇండస్ట్రీకి పరిచయమైంది. టీనా ఆ ఒక్క చిత్రంలో నటించింది. బాలీవుడ్ నటులు సైఫ్ అలీఖాన్, అమృతాసింగ్ కూతురు సారా అలీ ఖాన్.. కేదార్ నాథ్, సింబా, లవ్ ఆజ్ కల్ 2 సినిమాలు చేసి, తనకంటూ ఒక క్రేజ్ సంపాదించుకుంది. ప్రస్తుతం కూలి నెంబర్ వన్ సీక్వెల్, అత్రంగీ రే చిత్రాల్లో నటిస్తోంది. బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కూతురు అతియా సల్మాన్ ఖాన్ నిర్మించిన హీరో సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.
అనిల్ కపూర్ కుమార్తె సోనమ్ కపూర్ సావరియా మూవీతో ఎంట్రీ ఇచ్చి, సినిమాకి సినిమాకి సంబంధం లేకుండా ఎన్నో విభిన్నమైన పాత్రలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.తర్వాత ముబారకాన్, మోతిచూర్ చక్నాచూర్ సినిమాల్లో నటించింది. కాగా తెలుగులో అఖిల్ సినిమా సాయేషా చేసింది. ఈమె తండ్రి సుమిత్ సైగల్ హిందీలో ఎన్నో సినిమాలు చేశారు. అంతేకాదు, ప్రముఖ నటుడు దిలీప్ కుమార్ సాయేషా కి తాత అవుతారు.సాయేషా ప్రస్తుతం తమిళ, కన్నడ సినిమాల్లో నటిస్తోంది. బాలీవుడ్ విలన్ శక్తి కపూర్ కూతురు శ్రద్ధ కపూర్ తీన్ పత్తి సినిమాతో ఇండస్ట్రీలో అడుగు పెట్టి, ఆషికీ 2 మూవీతో స్టార్డమ్ తెచ్చుకుంది. తర్వాత ఎన్నో హిట్ సినిమాల్లో నటించిన శ్రద్ధ సాహో తో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం హిందీ సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.

