పెళ్ళైన పరిస్థితి మారలేదని అంటున్న అక్కినేని కోడలు…ఏమిటా కథ…?
Telugu actress Samantha :మోడలింగ్ రంగం నుంచి సినిమాల్లోకి అడుగుపెట్టి, తన నటనతో ఆకట్టుకున్న స్టార్ హీరోయిన్ సమంత తెలుగులో ఏం మాయ చేసావే మూవీతో ఎంట్రీ ఇచ్చింది. ఇక అదే సినిమాతో అక్కినేని నాగ చైతన్యతో ప్రేమలో పడిన సమంత మొత్తానికి అక్కినేని వారి కోడలు అయింది.
పెళ్లయ్యాక సినిమాలు ఆగిపోతాయని అందరూ భావిస్తే, రెట్టించిన ఉత్సాహంతో నటిస్తూ రెమ్యునరేషన్ కూడా ఎక్కువే అందుకుంటూ వచ్చింది. తెలుగులోనే కాదు, తమిళం, తదితర భాషల్లో దాదాపు 26సినిమాలు చేసిన సమంత పెళ్లి తర్వాత నటనకు అడ్డురాదని తేలిందని ఇటీవల ఆమె చెప్పుకొచ్చింది.
సినిమాల్లోనే కాదు, ఆహా ఓటిటి లో సామ్ జామ్ పేరిట అగ్ర హీరోలను సైతం ఇంటర్యూ చేస్తూ తన ప్రోగ్రాం లతో సత్తా చాటుతున్న సమంత మునుపటి కన్నా సంపాదన కూడా పెంచేసుకుంది. నిజానికి పెళ్లి తర్వాత ఛాన్స్ లు రావని అనుకున్నానని , కానీ అనూహ్యంగా ఛాన్స్ లు వచ్చేస్తున్నాయని చెప్పుకొచ్చింది. అదృష్టం అంటే అదే కదా.
