Devotional

డిశంబర్ 25 ముక్కోటి ఏకాదశి రోజు ఇలా చేస్తే కోటి జన్మల పుణ్యం దక్కుతుంది

Vaikuntha Ekadashi 2020 :ఈ నెల అంటే డిసెంబర్ 25న ముక్కోటి ఏకాదశి రోజున కోటి జన్మల పుణ్య ఫలం దక్కాలంటే బ్రహ్మ ముహూర్తం లో ఉత్తరద్వార దర్శనం ద్వారా వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం లేదా సమీపంలో ఉన్న విష్ణు ఆలయాలు ఏమైనా ఉన్న దర్శించుకోవచ్చు. ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తరద్వార దర్శనం ద్వారా స్వామిని దర్శించుకుంటే ముక్కోటి దేవతలకు నమస్కరించిన ఫలితం దక్కుతుంది ఆరోజున మూడు కోట్ల దేవతలను దర్శనం చేసుకున్నట్లు లెక్క.

ముక్కోటి ఏకాదశి రోజున గోమాతకు అరటి పండ్లు తినిపిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఉంటుంది అంతేకాకుండా అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ముక్కోటి ఏకాదశి రోజున వీలు అయితే 11 సార్లు విష్ణు సహస్రనామం చదవటానికి ప్రయత్నం చేయండి. 11 సార్లు 11 రకాల పూలతో 11 రకాల పండ్లతో 11 సార్లు విష్ణుసహస్రనామ పారాయణ చేయండి. విష్ణు సహస్రనామం చదవటం ఒక పండు నైవేద్యంగా పెట్టడం ఒక రకం పూలదండ సమర్పించడం హారతి ఇవ్వడం మరల రెండోసారి చదవటం రెండో రకం పూలదండను సమర్పించటం రెండో రకం పండు నైవేద్యం పెట్టడం హారతి ఇవ్వటం ఇలా 11 సార్లు చేస్తే కోటి జన్మల పుణ్య ఫలం దక్కుతుంది. అనుకున్న కోరికలు తీరుతాయి.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."