ఎసిడిటి ఉన్నవారు ఈ తప్పులు చేస్తే ఏమి అవుతుందో తెలుసా…నమ్మలేని నిజాలు
Acidity home remedies : ఎసిడిటి సమస్య అనేది ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో ఎదుర్కొనే ఉంటారు. ఎసిడిటి ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా తీసుకునే ఆహారం విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎసిడిటీ సమస్య ఉన్నప్పుడు ఆహారం తిన్న తర్వాత కడుపుబ్బరం, ఛాతిలో మంట, కడుపు నొప్పి, త్రేన్పులు వంటివి వస్తాయి.

ఈ సమస్యలు రాకుండా ఉండాలంటే తీసుకునే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సాధారణంగా ఎసిడిటి ఉన్నవారు కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. అవేంటో ఒక్కసారి చూద్దాం. ఎసిడిటీ సమస్య వచ్చినప్పుడు సాధ్యమైనంత వరకూ స్మోకింగ్ కి దూరంగా ఉండాలి. ఎందుకంటే సిగరెట్లలో ఉండే నికోటిన్ అనే పదార్థం కడుపులో గ్యాస్ ఎక్కువగా ఉత్పత్తి అవడానికి కారణమవుతుంది.
కాబట్టి ధూమపానానికి సాధ్యమైనంత వరకూ దూరంగా ఉండాలి. అలాగే మద్యపానంనకు కూడా దూరంగా ఉండాలి. కొంత మంది ఒకేసారి ఎక్కువ మొత్తంలో ఆహారం తీసుకుంటూ ఉంటారు. అలా తీసుకున్నప్పుడు కూడా గ్యాస్ ఉత్పత్తి పెరుగుతుంది. కాబట్టి ఆహారాన్ని తక్కువ మోతాదులో ఎక్కువసార్లు తీసుకోవాలి. .
ఎసిడిటీ సమస్య ఉన్నవారు భోజనం అయ్యాక లవంగం మొగ్గను బుగ్గన పెట్టుకుంటే మంచిది. అలాగే గోరువెచ్చని నీటిలో నిమ్మరసం., బేకింగ్ సోడా కలిపి తాగిన మంచి ఫలితం ఉంటుంది. భోజనం చేసిన తర్వాత అరస్పూన్ సొంపు నోట్లో వేసుకొని నమిలి మింగినా మంచి ఉపశమనం కలుగుతుంది. అలాగే కాఫీ, టీ ఎక్కువగా తాగకూడదు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

