karthika deepam today episodeMoviesTollywood news in telugu

కార్తీకదీపం వంటలక్కను ఈ నటితో పోల్చేస్తున్నారు…ఎవరో తెలుసా?

karthika deepam serial : సినిమాలకు ధీటుగా సీరియల్స్ నడుస్తున్నాయి. అందుకే సినీ స్టార్స్ తో సమానమైన గుర్తింపు బుల్లితెర నటులకు వస్తోంది. మలయాళంలో ప్రసారమైన ‘కరత ముత్తు’ సీరియల్ ని తెలుగులో స్టార్ మా లో కార్తీక దీపంగా ప్రసారం చేస్తున్నారు. కార్తీకదీపం సీరియల్ కు ఉన్న అభిమానులు ఏ సినిమాకు కూడా అంతగా లేరు. స్టార్ మా లో మోస్ట్ ఇంపార్టెంట్ సీరియల్ గా కార్తీకదీపం నిలువగా ఈ సీరియల్ బృందం తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ధారావాహికంగా వస్తున్న ఈ సీరియల్ లో వంటలక్క పాత్రతో దీప ఎక్కడలేని ఇమేజ్ తెచ్చేసుకుంది. కేరళకు చెందిన ఈ బుల్లితెర నటి అసలు పేరు ‘ప్రేమి విశ్వనాథ్’. 2014లో ఏసియానెట్ మలయాళం టీవీలో వచ్చిన ‘ కరత ముత్తు’ ధారావాహిక తో బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చిన ఈమె నటనను మహానటి సావిత్రి తో పోల్చడం కూడా ప్రస్తుతం వైరల్ గా మారింది. మరికొందరు బుల్లితెర సావిత్రిగా సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.

మహానటి సావిత్రి గారితో పోల్చినందుకు నా జన్మ ధన్యమైంది అంటూ తమ అభిమానులకు వంటలక్క చెప్పింది. స్టార్ మా లో ప్రసారమవుతున్న అన్ని సీరియల్ లో కంటే కార్తీకదీపం ముందు స్థానంలో ఉంది.2017 లో ప్రారంభమైన ఈ సీరియల్ టిఆర్పీ లో టాప్ రేటింగ్ పెంచుకుంది. దేశవ్యాప్తంగా ఈ సీరియల్ కు ఎక్కువ ఫాలోయింగ్ ఉంది. రోజురోజుకు ఎపిసోడ్ లో ఆసక్తిగా ఉంటుంది. కాగా ఈ సీరియల్ కు మలయాళంలో, తెలుగులో ఉత్తమ నటి అవార్డు గెలుచుకుంది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."