karthika deepam today episodeMoviesTollywood news in telugu

కార్తీక దీపం సౌందర్య వయస్సు కూడా ఆశ్చర్యమే…ఎంతో తెలుసా?

karthika deepam soundarya : తెలుగు బుల్లితెర రంగంలో సీరియల్స్ హవా సాగుతోంది. అందులో టాప్ రేటింగ్ లో మొదటి నుంచి దూసుకుపోతున్న కార్తీకదీపం సీరియల్ తెలుగు రాష్ట్రాల్లో చాలా పాపులర్ గా మారింది. ఈ సీరియల్ ముందు బిగ్ బాస్ లాంటి రియాల్టీ షోలు, స్టార్ హీరోల సినిమాల రేటింగ్స్ సైతం సాటిరాలేదు. ఇప్పటికీ కార్తీక దీపం టాప్ రేటింగ్స్ తెచ్చిపెడుతోంది. ఇక ఆ సీరియల్’లో ఉండే క్యారెక్టర్స్‌ను ఓ సారి పరిశీలిస్తే, కార్తిక్‌గా నిరుపమ్ పరిటాల ఆకట్టుకుంటుంటే, దీప పాత్రలో మలయాళీ భామ ప్రేమి విశ్వనాథ్ వచ్చిరాని తెలుగుతో పరవాలేదనిపిస్తూ వంటలక్కగా పాపులారిటీ తెచ్చుకుంది.

కేవలం ఈ రెండు పాత్రలే కాకుండా అత్తమ్మ సౌందర్య పాత్ర కూడా ఎంతో హుందా గా ఆకట్టుకుంటోంది. అయితే పవర్‌ఫుల్ లేడిగా మంచి అత్తగా చేస్తోన్న నటి అర్చన అనంత్ కర్నాటకలో పుట్టి పెరిగింది. ఈ అందాల అర్చన ప్రస్తుతం కార్తీక దీపంతో పాటు స్టార్ మా లోనే ‘కేరాఫ్‌ అనసూయ’ పేరుతో వస్తోన్న సీరియాల్‌లో కూడా మంచి పవర్‌ఫుల్‌ పాత్ర పోషిస్తోంది. నిజానికి అర్చన ఫ్యాషన్‌ డిజైనర్‌గా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలని ఆరాటపడి, అది కలిసిరాక తర్వాత నటి గా మారి, టీవీ తెరపై నట విశ్వరూపం ప్రదర్శిస్తోంది.

ఫ్యాషన్‌ డిజైనర్‌గా చేస్తున్నవేళ, తన సహచరులు ఓ కన్నడ ప్రాజెక్ట్‌ కోసం ఆడిషన్‌ ఇవ్వమని కోరగా.. సరే, అడిగారు కదా అని వెళ్లి ఆడిషన్‌లో పాల్గొనడంతో నటించే ఛాన్స్ వచ్చిందని ఇటీవల అర్చన ఓ మీడియాతో మాట్లాడుతూ వివరించింది. ఓ శవంలా పడుకోవడమనే పాత్రతో నటజీవితం స్టార్ట్ చేసి, నటనా ప్రయాణం సాగిస్తు న్నట్లు చెప్పుకొచ్చింది. ఈమె తండ్రి కన్నడ సినిమాలో పేరున్న నటుడు అనంత వేలు. కన్నడలో ఇప్పటికే మూడు చిత్రాలు చేశానని.. కానీ తెలుగులో ఇంకా ఎంట్రీ ఇవ్వలేదని.. ఓ పవర్‌ఫుల్‌ పోలీసాఫీర్‌గా కనిపించాలనుకుంటున్నాను. అలాగే ‘దాసీ’ క్యారెక్టర్‌లో కూడా నటించాలని ఉందని వివరించింది. ఇంతకీ ఈమె వయస్సు కేవలం 33 సంవత్సరాలేనట.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."