Healthhealth tips in telugu

Fruit&Juice:జ్యుస్ త్రాగటం మంచిదా? పండు తినటం మంచిదా?

fruit juice Benefits :జ్యుస్ త్రాగటం మంచిదా? పండు తినటం మంచిదా? అనే విషయానికి వచ్చినప్పుడు….పండును పండులా తినడమే మంచిది. పండును పళ్ల రసంలా రోగుల కోసం, నీరసంగా ఉన్నవాళ్ల కోసం, వృద్ధుల కోసం, కొరకలేని వారి కోసం మాత్రమే చేయాలి.

ఎందుకంటే పళ్ల రసంలో ఎంత లేదన్నా చక్కెర శాతం ఎక్కువగా ఉంటుంది. అదే పండులో స్వాభావికమైన చక్కెర తప్ప… అదనపు చక్కెర ఉండదు. ఆపిల్ పండు, ఆపిల్ జ్యూస్‌లను ఉదాహరణగా తీసుకుంటే… ఒక ఆపిల్‌లో 13 గ్రాముల స్వాభావికమైన చక్కెర ఉంటుంది.

అదే ఒక గ్లాసు ఆపిల్ జ్యూస్‌లో 24 గ్రాముల చక్కెర ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు పండు తినటానికి ప్రయత్నం చేయాలి. తప్పనిసరి పరిస్థితిలో మాత్రమే పండ్ల రసం తీసుకోవాలి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."