MoviesTollywood news in telugu

ప్రభాస్ హీరోయిన్ ని గుర్తు పట్టారా…ఇప్పుడు ఏమి చేస్తుందో తెలుసా?

Telugu heroine swetha agarwal : రంగుల ప్రపంచం మాయలోకం ఇలా సినిమా పరిశ్రమకు ఎన్నో పేర్లు. ఇక్కడ నిలబడాలంటే టాలెంట్ తో పాటు అదృష్టం ఉండాలి. లేకుంటే పత్తాలేకుండా పోతారు. ఇక టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రముఖ దర్శకుడు సురేష్ కృష్ణ దర్శకత్వం వహించిన “రాఘవేంద్ర” మూవీలో రెండో హీరోయిన్ గా శ్వేత అగర్వాల్ నటించింది. సీనియర్ సంగీత దర్శకుడు మణిశర్మ సంగీత స్వరాలను సమకూర్చారు. కానీ ఈ చిత్రంలో రెండో హీరోయిన్ గా నటించిన శ్వేత అగర్వాల్ మాత్రం ఉన్నట్లుండి తెరమరుగైంది.
Telugu heroine swetha agarwal
అయితే ఈ చిత్రంలో హీరోగా నటించిన ప్రభాస్ ప్రస్తుతం సౌత్ ఇండియా లోనే టాప్ హీరోల్లో ఒకరు గా పాన్ ఇండియా స్టార్ గా వెలిగిపోతున్నాడు. రాఘవేంద్ర చిత్రంలో నటించిన ఐదు సంవత్సరాల గ్యాప్ అనంతరం ఆంగ్లంలో “తందూరి లవ్” అనే చిత్రంలో హీరోయిన్ గా శ్వేత అగర్వాల్ చేసింది. కానీ ఈ చిత్రం కూడా ఆడియన్స్ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇక చివరగా బాలీవుడ్లో ప్రముఖ దర్శకుడు మహేష్ భట్ దర్శకత్వం వహించిన “షాపిత్” అనే హార్రర్ చిత్రంలో మెయిన్ లీడ్ పాత్రలో నటించింది.

ఈ చిత్రం పర్వాలేదనిపించినప్పటికీ ఆతర్వాత శ్వేత అగర్వాల్ కనిపించలేదు. వ్యక్తిగత కారణాల వల్ల సినిమా పరిశ్రమ వదిలిపెట్టి వెళ్ళిపోయిందని కొందరు చర్చించుకుంటున్నారు. అయితే ప్రస్తుతం శ్వేతా అగర్వాల్ ఏం చేస్తుంది.? ఎక్కడ ఉందనే విషయాల గురించి ఆచూకీ లేదు. ఒక్కోసారి కొంతమంది హీరోయిన్లు చాలా కష్టపడి సినిమా పరిశ్రమకు వచ్చి సినిమా ఛాన్స్ లు కొట్టేసిన, అనుకోకుండా ఒకటి రెండు చిత్రాలలో నటించగా అవి కాస్తా ఫ్లాప్ అయితే సినిమా పరిశ్రమలో తెరమరుగైన హీరోయిన్ల మాదిరిగా శ్వేత అగర్వాల్ మిగిలింది.
https://www.chaipakodi.com/

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."