రోజు1 పండు తింటే కీళ్ల మధ్య శబ్ధం తగ్గి జిగురు,వశ్యత పెరిగి కీళ్ల నొప్పులు తగ్గుతాయి
Aloo Bukhara Benefits Joint Pains : Aloo Bukhara పండ్లు మంచి ఎరుపు వర్ణంలో ఉండి పులుపు తీపి కలిసిన రుచిలో ఉండి మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. రోజుకి ఒక పండు తింటే ముఖ్యంగా ఎముకల బలహీనత., కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు వంటివి తగ్గుతాయి.
ఈ పండ్లను సీజన్లో తినవచ్చు. సీజన్ కానప్పుడు .Aloo Bukhara పండ్లు డ్రై రూపంలో లభ్యమవుతాయి. ఇవి ముఖ్యంగా మహిళల్లో మోనోపాజ్ సమయంలోనూ, ఆస్టియో ఫ్లోరోసిస్ వంటి సమస్యలతో బాధపడుతున్న వారికి అద్భుతమైన ఒక మంచి పోషకాలు ఉన్న పండు అని చెప్పవచ్చు. ఈ పండులో ఉన్న పోషకాలు ఎముకలకు పోషకాలను అందించి ఎముకలు బలంగా ఉండేలా చేసి ఎముకల బలహీనత లేకుండా చేస్తుంది.
ఎముకల్లో మినరల్స్ డెన్సిటీని బాగా పెంచుతుంది. ఈ Aloo Bukhara పండులో ఉండే లియ గాండ్స్, ఐసో కాంపౌండ్స్ వంటివి ఎముకల యొక్క స్పెసిఫిక్ ఆల్కలీన్ కాంపౌండ్స్,పాస్పెట్ ను బాగా పెంచుతుంది. Aloo Bukhara పండులో ఉండే ఫినోలిక్ కాంపౌండ్స్ ఐ.జి.ఎఫ్.వన్ ని కూడా బాగా స్టిములేట్ చేస్తుంది.
దాంతో విటమిన్ డి, విటమిన్ కె ఎముకలకు ఇంతకు ముందు వెళ్ళే దానికన్నా ఎక్కువ మోతాదులో అందుతుంది. అందువలన ఎముక కణాల యొక్క గ్రోత్ చాలా స్పీడ్ గా ఉంటుంది. దాంతో ఎముకల సెల్ టర్నోవర్ పెరిగి ఎముకల కణాలు దగ్గరిగా ఫామ్ అవ్వటం వలన బోన్ డెన్సిటీ పెరుగుతుంది. అలాగే కీళ్ల మధ్య జిగురు,వశ్యత పెరుగుతాయి. అంతేకాకుండా కీళ్ల మధ్య శబ్ధం కూడా తగ్గుతుంది.
కాబట్టి 35 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళ రోజుకొక Aloo Bukhara పండు తింటే చాలా మంచిది. వయసు పెరిగే కొద్దీ వచ్చే సమస్యలు మోకాళ్ళ నొప్పులు., కీళ్ల నొప్పులు, నడుం నొప్పి వంటి వాటిని తగ్గిస్తుంది. ఎముకలకు అవసరమైన పోషకాలు బాగా అంది ఎముకల దృఢత్వానికి చాలా బాగా సహాయపడుతుంది. ఈ పండులో బయోయాక్టివ్ కాంపౌండ్స్ ఉండుట వలన డయాబెటిస్ ఉన్నవారు కూడా తినవచ్చు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
https://www.chaipakodi.com/