మన హీరోల జీవితాన్ని మార్చిన సినిమాలు ఏమిటో చూడండి
Telugu Actors Best Movies :తెలుగులో స్టార్ హీరోలుగా రాణిస్తున్న హీరోలకు మంచి కెరీర్ రావడానికి మొదట్లో దోహదపడ్డ సినిమాలు ఎన్నో ఉంటాయి. అయితే ఒక్కో హీరోకి ఒక్కో సినిమా కెరీర్ కి బాటవేసిందని చెప్పొచ్చు. అప్పుడే ఫాన్స్ కూడా పుట్టుకొస్తారు.

అలాంటి మాస్ ఇమేజ్ తెచ్చిన స్టార్ డమ్ మూవీస్ విషయంలోకి వెళ్తే, మెగాస్టార్ చిరంజీవి స్వయంకృషితో ఎదిగారు. ఎన్నో సినిమాలు చేసి, హిట్స్ అందుకున్నా, స్టార్ హీరోని చేసిన మొదటి సినిమా మాత్రం ఖైదీ అని చెప్పాలి. ఏ కోదండరామిరెడ్డి డైరెక్షన్ లో 1983లో రిలీజైన ఈ సినిమా చిరు కెరీర్ ని మార్చేసింది.

ఇక నందమూరి బాలకృష్ణ పలు సినిమాలు చేసినప్పటికీ కోడి రామకృష్ణ డైరెక్షన్ లో వచ్చిన మంగమ్మగారి మనవడు మూవీ బ్రేక్ ఇచ్చి, స్టార్ ఇమేజ్ తెచ్చింది. విక్రమ్ తో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన నాగార్జునను మాస్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసిన సినిమా అనగానే శివ మూవీ గుర్తొస్తుంది. రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా నాగ్ కెరీర్ ని మార్చేసింది.

కలియుగ పాండవులు మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన వెంకటేష్ కి స్టార్ ఇమేజ్ తెచ్చిన మూవీ మాత్రం బొబ్బిలిరాజా. బి గోపాల్ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ కమర్షియల్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసింది.పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ కి తొలిప్రేమ మూవీ మంచి ఇమేజ్ తెచ్చింది. కరుణాకరన్ అద్భుతంగా తెరకెక్కించారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ ని మలుపు తిప్పిన సినిమా ఆది. వివి వినాయక్ డైరెక్షన్ లో వచ్చిన ఆది మూవీ తారక్ మాస్ ఇమేజ్ తెచ్చి, హీరోగా ఎస్టాబ్లిష్ చేసింది.

మాస మహారాజు గా నిల్చిన రవితేజకు క్రేజ్ తెచ్చిన సినిమా పూరి జగన్నాధ్ డైరెక్షన్ లోని ఇడియట్ మూవీ. మహేష్ బాబుకి స్టార్ హీరో రేంజ్ ని గుణశేఖర్ డైరక్షన్ లోని ఒక్కడు సినిమా తెచ్చింది. బాహుబలితో పాన్ ఇండియా స్టార్ గా మారిన ప్రభాస్ కి వర్షం మూవీ స్టార్ ఇమేజ్ తెచ్చింది. శోభన్ డైరెక్షన్ చేసాడు. చిరంజీవి వారసుడిగా చిరుత మూవీతో ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ ని స్టార్ హీరోగా నిలబెట్టిన మూవీ రాజమౌళి తీసిన మగధీర మూవీ.

