నరేష్ రోజుకి ఎన్ని లక్షల పారితోషికం తీసుకుంటాడో తెలుసా?
Naresh remuneration: రెండు దశాబ్దాల క్రితం కామెడీ హీరోగా నటించి ఎంతో మండి అభిమానులను సంపాదించుకున్నాడు నరేష్.ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ కూడా చాలా బిజీగా ఉన్నాడు. నరేష్ నటించే సినిమాలు హిట్ అవ్వటంతో వరుస అవకాశాలు వస్తున్నాయి. గత సంవత్సరం ఎంత మంచివాడవురా, డిస్కో రాజా, భీష్మ, ఒరేయ్ బుజ్జిగా, అమరం అఖిలం ప్రేమ, సోలో బ్రతుకే సో బెటర్ సినిమాలలో నటించాడు.
అయితే నరేష్ రోజుకి ఎంత పారితోషికం తీసుకుంటాడు అనే విషయానికి వస్తే రోజుకి 3 లక్షల రూపాయిలను తీసుకుంటాడట. సినిమా సినిమాకి తన రేంజ్ ని పెంచుకుతూ పోతున్నాడు. ప్రస్తుతం సినిమాలతో చాలా బిజీగా ఉన్నాడు. దర్శకులు నరేష్ కోసం పాత్రలను సృస్టిస్తున్నారు.

