Beauty Tips

Homemade facial:బ్యూటీపార్లర్‌కు వెళ్లకుండా ఇంట్లోనే ఫేషియల్‌ చేసుకుందామా

Homemade facial :ఇంటిలోనే తక్కువ ఖర్చుతో ఫేసియల్‌ తయారు చేసుకోవాలంటే … ముందుగా శెనగ పిండితో ముఖాన్ని రుద్ది శుభ్రంగా నీటితో కడుక్కోవాలి.ఆ తర్వాత, ఐస్‌ వాటర్‌ లో ముంచిన దూదితో ముఖాన్ని తుడుచుకోవాలి.

అటు తర్వాత, వేడి నీళ్లలో చిటికెడు పసుపు,కొంచెం వేపాకు వేసి ముఖానికి ఆవిరి పెట్టి,ఆ తర్వాత తేనె,పెరుగు తగుపాళ్లలో కలిపి ప్యాక్‌ వేసుకోవాలి.

దీనికి ముందుగానే చక్రాల రూపంలో తరిగిన కీరదోస ముక్కలను కళ్లపై ఒక 20 నిమషాల పాటు పెట్టుకోవాలి. ఆ తరువాత ముఖాన్ని శుభ్రంగా కడిగేస్తే మంచి ఫలితాన్ని పొందవచ్చు.

పచ్చి బంగాళాదుంపను తరిగి దానికి కొంచెం నిమ్మరసం, ఓట్‌మీల్‌ పొడి, పాలు కలిపి ముఖానికి రాసుకుంటే చక్కటి ఫలితం ఉంటుంది. దోసకాయ రసంతో ముఖం శుభ్రం చేసుకుంటే యాస్ట్రింజెంట్‌లా పని చేస్తుంది. బాదం పప్పు పొడి, ఓట్‌మీల్‌ పొడి, పాలు కలిపి ముఖానికి రాసుకుంటే ముఖం కాంతివంతంగా వస్తుది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."