ఉదయ్ కిరణ్ భార్య విషిత ఇప్పుడు ఎక్కడ ఉంది…ఏమి చేస్తుంది…?
Uday Kiran Wife Vishita :ఉదయ్ కిరణ్ చాలా తక్కువ సమయంలోనే మంచి హిట్స్ సాధించి మంచి ఫాలోయింగ్ ని సాంపాదించాడు. కథలను ఎంచుకొనే క్రమంలో కొన్ని తప్పుల కారణంగా ప్లాప్స్ వచ్చాయి. అదే సమయంలో చిరు అల్లుడిగా మిస్ అవ్వటం,అవకాశాలు తగ్గటం వంటివి జరగటంతో సూసైడ్ చేసుకున్నాడు. ఉదయ్ కిరణ్ పరాజయాలతో ఉన్నప్పుడే ఒక పార్టీలో విషిత పరిచయం అయింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారటంతో పెద్దలను ఎదిరించి ఉదయ్ కిరణ్ విషిత మెడలో మూడు ముళ్ళు వేసాడు. విషిత సాఫ్ట్ వెర్ ఇంజనీర్ గా పనిచేసేది. పెళ్లి అయ్యాక కూడా తన ఉద్యోగాన్ని కొనసాగించింది. విషిత ,ఉదయ్ కిరణ్ చాలా ప్రేమగా ఉండేవారు.
ఉదయ్ కిరణ్ కి అవకాశాలు తగ్గినా విషిత ప్రేమలో కొంతకాలం మర్చిపోయాడు. ఆ తర్వాత కాస్త డిప్రెషన్ కి లోను అయ్యాడు. ఆ తర్వాత డిప్రెషన్ లోకి వెళ్ళితే విషిత డాక్టర్స్ తో కౌన్సలింగ్ ఇప్పించింది. అయినా ఫలితం లేకపోయింది. ఉదయ్ కిరణ్ చనిపోయాక విషిత మీద అనేక రకాల కథనాలు వచ్చాయి.
ఆమె ఆఫీస్ లో పనిచేసే వారు చెప్పిన దాని ప్రకారం ఆమె ఇంకా ఉదయ్ కిరణ్ జ్ఞాపకాలతో జీవిస్తుందట. ఆమె బాగానే సంపాదిస్తుంది. ఆమె సంపాదించిన దానిలో కొంత మొత్తాన్ని సేవా కార్యక్రమాలకు వినియోగిస్తుందట. అంతేకాకుండా శని,ఆదివారాల్లో అనాదశరణాలయాలకు వెళ్లి గడుపుతూ ఉంటుందట. ఇంకా ఆమె ఉదయ్ కిరణ్ జ్ఞాపకాలతో ఉందంటే చాలా గ్రేట్ కదా!
