కార్తీక దీపం వంటలక్కకు ఎంత కష్టం వచ్చిందో…అయ్యో పాపం
Karthika Deepam premi viswanath :కార్తీకదీపం సీరియల్ ఎంత ఫేమస్ అయిందో చెప్పాల్సిన అవసరం లేదు కార్తీకదీపం సీరియల్ కి చాలా మంది అభిమానులు ఉన్నారు. డాక్టర్ బాబు వంటలక్క ఎప్పుడు కలుస్తారు అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ సీరియల్ టాప్ రేటింగ్లో దూసుకుపోతోంది. కార్తీకదీపం సీరియల్ తో వచ్చిన క్రేజ్ దృష్ట్యా వంటలక్క పాత్ర చేసిన ప్రేమి విశ్వనాథ్ కి యాడ్ ఆఫర్స్ కూడా వచ్చాయి. యాంకర్ సుమ తో కలిసి ఒక యాడ్ లో నటించింది. కార్తీకదీపం సీరియల్ క్రేజ్ కి చెక్ పెట్టడానికి రెండు సీరియల్స్ రెడీ అయ్యాయి. అందులో ఒకటి గృహ లక్ష్మి. ఇది మంచి రేటింగ్ లో ఉంది.
కార్తీకదీపం వంటలక్కను దాటి గృహలక్ష్మి టాపర్ గా నిలిచే అవకాశం లేకపోలేదని అంటున్నారు. జీతెలుగులో త్వరలో రాబోయే కృష్ణ తులసి సీరియల్. ఈ సీరియల్ ప్రోమో చూస్తుంటే, ఇందులో హీరోయిన్ క్యారెక్టర్ కూడా మొదట్లో కార్తీకదీపం వంటలక్క లాగానే నల్లగా చూపిస్తున్నారు.
కార్తీకదీపంలో ప్రేమీ విశ్వనాథ్ వంటలక్క అయితే, ఈ కృష్ణ తులసిలో హీరోయిన్ పాటలక్క. ఈ సీరియల్ ఇంకా ప్రసారం కాక ముందే ఈ పాటలక్కకు ఫ్యాన్స్ ఏర్పడ్డారు. కాబట్టి కార్తీక దీపం సీరియల్ కి పోటీ తప్పదు.