MoviesTollywood news in telugu

రాజబాబు చివరి దశలో ఎలా ఉన్నారో తెలుసా ?అసలు ఏమి జరిగింది…?

Tollywood Comedian Raja Babu :తెలుగు చిత్రసీమలో దాదాపు రెండు దశబ్దాల పాటు తిరుగులేని కమెడియన్ గా సత్తా చాటిన రాజబాబు ఎందరో మదిని దోచుకున్నాడు. ఆరోజుల్లో రాజబాబు లేని సినిమా ఉండేది కాదు. దాదాపు 600కి పైగా మూవీస్ లో నటించాడు. పైగా ఆయనకు కూడా సాంగ్స్ పెట్టేవారు.

నవ్వుతూ నవ్విస్తూ ఉండే రాజబాబు ఉదార స్వభావంతో ఎన్నో దానాలు చేసారు. అతడికి నాగేంద్రబాబు, మహేష్ బాబు అనే ఇద్దరు కొడుకులు. అయితే కొన్నాళ్ళకు భార్యతో విబేధాలు వచ్చాయి. రాజబాబు మరణించే సమయానికి పెద్ద కొడుక్కి 11ఏళ్ళు. రెండో కొడుక్కి 8ఏళ్ళు. రాజబాబు చేసిన సంపాదనతోనే పిల్లల్ని పెంచి పోషించింది అతడి భార్య. అందుకే పిల్లలిద్దరూ సాఫ్ట్ వేర్ కంపెనీలను ఫారిన్ లో పెట్టి, వందలకోట్లు సంపాదిస్తున్నారు.

అసలు రాజబాబుకి 46ఏళ్ళ వయస్సులోనే గొంతు కేన్సర్ వచ్చింది. గొంతు ఆపరేషన్ చేయించుకుంటే ఇక మాట్లాడ్డానికి వీలుండదు. అందుకే ఆపరేషన్ కి వెనకడుగు వేసినా, ఫ్యామిలీ వత్తిడితో ఆపరేషన్ చేయించుకోక తప్పలేదు. అయినా సెట్ కాలేదు. ‘నేను ఎవరిని మోసం చేయలేదు, భార్య, పిల్లలు, తమ్ముళ్లు అందరూ బాగుండాలి. నేను పోయాక నాకోసం ఎవరూ ఏడవద్దు’అని రాసిన కాగితాన్ని అమ్మకు ఇచ్చి, ఆసుపత్రి నుంచి ఇంటికి పంపించేశాడు. తమ్ముడు, భార్య , పిల్లలు హాస్పిటల్ కి వచ్చేలోపే రాజబాబు ఈ లోకం నుంచి నిష్క్రమించారు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."