ఈ బ్యూటీ కపుల్స్ పిల్లలు కనేదెప్పుడో…అభిమానుల ఆశ ఎప్పుడు తీరేనో
Ram Charan And Upasana :మోస్ట్ బ్యాచిలర్స్ కూడా కరోనా లాక్ డౌన్, అన్ లాక్ సమయంలో పెళ్లిళ్లు చేసేసుకున్నారు. అలాగే అంతకుముందు కొందరికి పెళ్లిళ్లయ్యాయి. ఇక ప్రేమించి పెళ్లిచేసుకున్న సెలబ్రిటీ జంటలు కూడా ఒకరికొకరు ఎంతో ప్రేమగా వుంటూ సెల్ఫ్ రెస్పెక్ట్ తో నలుగురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇందులో రాంచరణ్ , ఉపాసన లకు పెళ్ళై దాదాపు 8 ఏళ్ళు పూర్తయింది. అయితే పిల్లల్ని కనడానికి ఇంకా ప్లాన్ చేసుకోలేదని చెప్తున్నారు.
ముఖ్యంగా ఉపాసనని పిల్లలకు సంబంధించిన ప్రశ్న ఎప్పుడడిగినా ఇంకా టైం ఉంది అంటూ దాటవేస్తుంది. ఇక చెర్రీ దీనిపై స్పందించిన దాఖలాలు లేవు మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ మాట ఏమిటో గానీ మెగా అభిమానులు మాత్రం వారసుడు కోసం వెయిట్ చేస్తున్నారు. అక్కినేని సమంత, నాగచైతన్య 2017 లో ప్రేమించి పెళ్ళిచేసుకుని లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. సమంత సినిమాలు , ఓటిటి హోస్టింగ్ పేరుతొ బిజీగా ఉంటె, చైతన్య కూడా వరుస సినిమాలతో బిజీగానే ఉన్నాడు. ఇలాంటి టఫ్ టైం లో ఇంకా పిల్లలు వద్దనుకుంటున్నారు. ఇక విషయమేంటంటే ఉపాసన, సమంత కూడా బెస్ట్ ఫ్రెండ్స్.
వరుణ్ సందేశ్, వితికా షేరు చూడముచ్చటగా ఉంటారు. వీళ్ళు ప్రేమించి 2015 లో వివాహం చేసుకున్నారు. పెళ్లై 5 ఏళ్ళు గడుస్తున్నా ఇంకా పిల్లల విషయంలో క్లారిటీలేదు. సింహమంటే చిన్నోడే వేటకొచ్చాడే… అంటూ బాలయ్య బాబుతో ఆడిపాడిన హాట్ బ్యూటీ నమిత 2017 లో వీరేంద్ర చౌదరి అనే వ్యక్తిని పెళ్లాడింది. పెళ్ళై మూడేళ్లు అవుతున్నా గాని అప్పుడే పిల్లలు ఎందుకులే అనే ధోరణిలో ఉన్నారు.

