MoviesTollywood news in telugu

ఆ నిర్ణయం వెనక ఉన్నది నేనే అంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన చంద్రబోస్

Chandrabose and Singer Sunita :సినిమా హిట్ వెనుక సాంగ్స్ కీలక పాత్ర పోషిస్తాయి. సాంగ్ రాయడం, బాణీ కట్టడం, స్టెప్స్ ఇలా పాట పిక్చరైజేషన్ లో ఎన్నో భాగాలుంటాయి. ఎవరి డ్యూటీ వాళ్ళు చేసుకుపోతారు. టోటల్ గా డైరెక్టర్ పర్యవేక్షణ ఉంటుంది. కానీ పాటల రచయిత చంద్రబోస్ తాను రాసిన ఓ పాటను సింగర్ సునీతతో పాడించాలని పట్టుబట్టి కూర్చున్నాడట. నిజానికి సాంగ్ రాయడం వరకే ఆయన విధి. ఎవరిచేత పాడించుకోవాలో మ్యూజిక్ డైరెక్టర్ పని.

కానీ చంద్రబోస్ “30 రోజుల్లో ప్రేమించడం ఎలా” అనే మూవీలో ‘నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా’ అనే సాంగ్ రాసిన సమయంలో తన మదిలో సింగర్ సునీత గాత్రమే మెదిలిందట. దాంతో ఈ పాటను ఆమె చేతనే పాడించాలని మ్యూజిక్ డైరక్టర్ అనూప్ రూబెన్స్ ను కోరాడట. అనూప్ మనసులో వేరే సింగర్ ఉండొచ్చు కానీ, చంద్రబోసు భీష్మించాడట. ఎలాగైతేనేం రూబెన్స్ ని ఒప్పించి ఆమెతో పాడించారు.

తీరా ఆ సాంగ్ రిలీజయ్యాక ఎంతటి సంచలనం సృష్టించిందంటే, యూట్యూబ్ లో భారీ వ్యూస్ సొంతం చేసుకుంది. చంద్రబోస్ ఎందుకంతాలా పట్టుబట్టాడో అప్పుడు అర్ధం అయిందట. ఇక చంద్రబోస్ పట్టుబట్టిన విషయంపై సింగర్ సునీత కూడా రియాక్ట్ అయింది. తన కెరీర్ లో ఎంతోమంది రచయితల పాటలకు ప్రాణం పోశానని, అయితే ‘నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా’ సాంగ్ తనకు స్పెషల్ అని, తాను ఇంతవరకూ పాడిన సాంగ్స్ ఒక ఎత్తు, ఈ పాట మరో ఎత్తు అని సునీత చెప్పింది.