MoviesTollywood news in telugu

అబ్బాయిగారు సినిమాను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఎవరో…?

Abbaigaru Full Movie :తమిళ దర్శక, నటుడు 1987లో రూపొందించిన యంగ్ చిన్న రాజా సినిమాలో రాధ హీరోయిన్ గా చేసింది. ఈ సినిమా హిట్ అవ్వడంతో పాటు మంచి కలెక్షన్స్ తెచ్చింది. దాంతో బేటా పేరుతొ అనిల్ కపూర్, మాధురి దీక్షిత్ జంటగా హిందీలో రీమేక్ చేయగా హయ్యస్ట్ గ్రాసర్ గా నిల్చింది. ఇక తమిళ సినిమా తెలుగు రీమేక్ హక్కులు సూపర్ స్టార్ కృష్ణ కొన్నాడు. పద్మాలయ బ్యానర్ లో ఈ సినిమా తీయాలని, తల్లి పాత్రకు వాణిశ్రీని ఎప్రోచ్ అయ్యారు. అయితే గతంలో విజయనిర్మల తో ఏర్పడిన వివాదం కారణంగా కృష్ణ తో నటించడానికి ఒకే చెప్పలేదు.

అంతకుముందు నాగాస్త్రం తీసిన నిర్మాతలు యంగ్ చిన్న రాజా మూవీని కృష్ణతో తీయడానికి ముందుకి వచ్చారు. ఎందుకో ఈ మూవీ వెనక్కి వెళ్ళిపోయింది. దీంతో రాశి మూవీస్ నరసింహారావు 30లక్షలకు హక్కులు కొని, విక్టరీ వెంకటేష్ తో అబ్బాయిగారు పేరిట రీమేక్ చేసారు. నిజానికి ఈ సినిమా కె రాఘవేంద్రరావు డైరెక్ట్ చేయాలి. అదే సమయంలో నాగార్జునతో ఓ మూవీకి టి త్రివిక్రమరావు దగ్గర అడ్వాన్స్ కూడా తీసుకోవడం, అబ్బాయిగారు మీద ఎక్కువ ఫోకస్ పెట్టడంపై ఆనోటా ఈ నూటా త్రివిక్రమరావు ఆవేదన విన్న రాఘవేంద్రరావు చివరకు అబ్బాయిగారు ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు.

అప్పుడు ఈవీవీ సత్యనారాయణను డైరెక్టర్ గా సెలెక్ట్ చేసారు. ఛాలెంజ్ గా ఈమూవీని తీసుకుని ఈవీవీ పనిచేయడంతో మంచి హిట్ అయింది. అయితే మూల కథలో ఎన్నో మార్పులు చేసారు. తల్లి పాత్రకు వాణిశ్రీ ని అడిగితె ఆమె 16లక్షలు రెమ్యునరేషన్ డిమాండ్ చేయడంతో చివరకు జయచిత్రను సెలక్ట్ చేసారు. అబ్బాయిగారు మూవీకి కృష్ణ క్లాప్ కొట్టారు. ఈ సినిమా తర్వాత జయచిత్ర సెకండ్ ఇన్నింగ్స్ లో బిజీ అయ్యింది. 1993సెప్టెంబర్ లో రిలీజైన ఈ మూవీ ఘనవిజయం సాధించడమే కాదు, కృష్ణ చెప్పినట్లు కొన్ని ఏరియాల్లో చంటి మూవీని క్రాస్ చేసింది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."