MoviesTollywood news in telugu

షాకింగ్ నిర్ణయం తీసుకున్న లావణ్య…కారణం ఆదేనా..!?

Telugu actress lavanya tripathi :టివిల ప్రభావమో,కొందరు హీరోయిన్స్ నెగెటివ్ రోల్స్ తో ఆకట్టుకోవడమో తెలీదు గానీ కొందరు హీరోయిన్స్ నెగెటివ్ రోల్స్ వేయడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. కేవలం హీరోలతో రొమాన్స్ చేయడమే,కాకుండా పవర్ ఫుల్ విలన్ పాత్రలలో ఫైటింగ్ చేయడానికి కూడా ఆసక్తి చూపిస్తున్నారు. రెగ్యులర్ హీరోయిన్ పాత్రలకి మాత్రమే పరిమితం అయిపోకుండా తమని తాము ఎలివేట్ చేసుకునే విధంగా యాక్టింగ్ కి స్కోప్ ఉన్న విలనిజం పండించడానికి కూడా రెడీ అవుతున్నారు.

స్టార్ హీరోయిన్ సమంత ఇప్పటికే రెగ్యులర్ కమర్షియల్ హీరోయిన్ పాత్రలకి స్వస్తి చెప్పి ఫిమేల్ సెంట్రిక్ సినిమాలు చేస్తూ, రీసెంట్ గా ది ఫ్యామిలి మెన్ వెబ్ సిరీస్ లో విలన్ గా కనిపించబోతుంది. ఇక రెజినా కాసాండ్రా కూడా చక్ర సినిమాలో విలనిజం పండించింది. ఇక నటుడు శరత్ కుమార్ కూతురు నటి వరలక్ష్మి కూడా పవర్ ఫుల్ విలన్ పాత్రలలో దూసుకెళ్తోంది.

తాజాగా లావణ్య త్రిపాఠి కూడా విలన్ పాత్రలవైపు మొగ్గు చూపిస్తోంది. నెగిటివ్ రోల్స్ చేయడానికి తాను ఆసక్తిగా ఉన్నానని అలాంటి పాత్రలతో ఓ రెండు సినిమాలు కమిట్ అయ్యానని త్వరలో వాటికి సంబందించిన వివరాలు తెలుస్తాయని రీసెంట్ గా ఏ1 ఎక్స్ ప్రెస్ రిలీజ్ సందర్భంగా ప్రమోషన్ ఇంటర్వ్యూలో ఆమె తన మనసులోని మాట చెప్పుకొచ్చింది. రొటీన్ గా హీరోయిన్ పాత్రలు కాకుండా కొత్తదనం గల పాత్రలు ముఖ్యంగా విలనీ రోల్స్ చేస్తున్నప్పుడు టాలెంట్ తెలుస్తుందని అంటోంది ఈ భామ. ఇక స్టార్ హీరోలు కూడా నెగెటివ్ రోల్స్ వైపు ఎలాగూ మొగ్గు చూపిస్తున్నారు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."