MoviesTollywood news in telugu

దిల్ రాజు తెలివి చూస్తే షాక్ అవ్వాలసిందే…3 కోట్లతో 100 కోట్లు…!?

Dil Raju : ఒకప్పుడు కామెడీ హీరోగా హిట్ మీద హిట్ అందుకున్న అల్లరి నరేష్ ఆతర్వాత వరుస ప్లాప్ లతో సతమతమవుతూ, క్యారెక్టర్ యాక్టర్ గా కూడా చేయడానికి సిద్ధపడ్డాడు. అయితే రోజులన్నీ ఒకేలా ఉండవని నిరూపిస్తూ అతడు ‌ హీరోగా నటించిన నాంది సినిమా ప్రేక్షక ఆదరణ అందుకుంటోంది. మొత్తానికి ఎన్నాళ్ళనుంచో ఎదురుచూస్తున్న సక్సెస్ ను ఈ సినిమాతో నరేష్‌ దక్కించుకున్నాడు. అయితే ఇక్కడే లాజిక్కు ఉంది. ఏ పని చేసినా అందులో లాభాన్ని అందుకునే దిల్ రాజు ఈ సినిమాను కేవలం మూడు కోట్ల రూపాయలకు నాలుగు భాషల రీమేక్‌ రైట్స్‌ ను దక్కించుకుని బాలీవుడ్‌ లో యంగ్‌ స్టార్‌ హీరోతో ఈ సినిమాను తెరకెక్కించేందుకు ఇప్పటికే చర్చలు మొదలు పెట్టాడు.

నిజానికి ఒక సాధారణ డిస్ట్రిబ్యూటర్ స్థాయి నుండి బడా ప్రొడ్యూసర్ స్థాయికి ఎదిగిన దిల్‌ రాజు సినిమా వ్యాపారంలో ఆందెవేసిన చేయిగా మారిపోయాడు. ఇక తమిళం, కన్నడం మలయాళంలో కూడా ఈ సినిమా ను యంగ్ హీరోలతో రీమేక్ చేయాలని అక్కడి నిర్మాతలతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఎంత లేదన్నా ఈ 4భాషల సినిమాల విలువ వంద కోట్లకు పైగానే ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల అంచనా. చిన్న బడ్జెట్‌ సినిమా రీమేక్‌ రైట్స్ ను కొనుగోలు చేసి వంద కోట్ల బిజినెస్ చేస్తున్న దిల్‌ రాజు ముందు ఎవరూ ఆగలేరని టాక్ వినిపిస్తోంది.

నిజానికి అల్లరి నరేష్ నటించిన నాంది సినిమాకు భాష తో సంబంధం లేదు. కమర్షియల్ ఎలిమెంట్స్ కాస్త తక్కువగా ఉన్నా కూడా మంచి సినిమా అంటూ విమర్శకుల ప్రశంసలు దక్కాయి. అంతేకాదు, అన్ని భాషల్లో కూడా సక్సెస్‌ అయ్యే యూనివర్శిల్ కాన్సెప్ట్‌ తో నాంది సినిమా నిర్మించారు. అందుకే నాలుగు భాషల్లో రీమేక్‌ చేసేందుకు దిల్‌ రాజు సిద్దం అయ్యాడు. ఎలాంటి సినిమాలు తీసుకోవాలి, ఎలాంటి కథలు ఎంపిక చేసుకోవాలో ప్రస్తుతం ఇండస్ట్రీలో దిల్ రాజుని చూసి నేర్చుకుని తీరాలని పలువురు ట్రేడ్ పండితులు విశ్లేషిస్తున్నారు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."