వరుణ్ కెరీర్ కోసం నాగబాబు మెగా ప్లాన్…మరీ అంత త్యాగమా…!?

Varun Tej :మెగా బ్రదర్ నాగబాబు తనయుడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కెరీర్ కోసం చాలా కష్టపడుతున్నాడు. తనదైన శైలిలో డిఫరెంట్ మూవీస్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. కంచె, ఫిదా , గద్దలకొండ గణేష్ ఇలా ఒకదానికొకటి భిన్నంగా ఉన్నాయి. అలాగే వెంకటేష్ తో కల్సి చేసిన మల్టీస్టారర్ ఎఫ్ 2కూడా బ్లాక్ బస్టర్ అయింది. ఇప్పుడు ఎఫ్ 3 వస్తోంది. అయితే ఎంత కష్టపడ్డా ఇప్పుడున్న కాంపిటేషన్ లో అన్నయ్య చిరు హెల్ప్ తీసుకుంటున్న మెగా బ్రదర్.

ప్రస్తుతం వరుణ్ తేజ్ హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నా కానీ నాగబాబు మాత్రం వరుణ్ తేజ్ కెరీర్ కోసం మరో మెగా ప్లాన్ రెడీ చేస్తున్నాడని టాక్. పునాది ఇంకా గట్టిగా ఉండాలన్న ఉద్దేశ్యంతో ప్రస్తుతం నడుస్తున్న రీమేక్ మూవీస్ ట్రెండ్ కి అనుగుణంగా తెలుగు హిట్టైన పాత సూపర్ హిట్ సినిమాలను ఇప్పటి ట్రెండ్‌కు తగ్గట్టు రీమేక్ చేయాలనే ఆలోచన పెరిగింది. అవీ ముఖ్యంగా చిరంజీవి, పవన్ నటించిన సినిమాలు చేయాలన్న యోచన చేస్తున్నట్లు టాక్ నడుస్తోంది.

ఇప్పటికే పలు సినిమాల్లో పాటలు రీమిక్స్ అయ్యాయి. ఇక పనవ్ కళ్యాణ్ నటించి, డైరెక్ట్ చేసిన ‘జానీ’ సినిమాతో పాటు, చిరంజీవి హీరోగా కోదండరామిరెడ్డి దర్శకత్వంలో క్రియేటివ్ కమర్షియల్ పతాకంపై కే.యస్.రామారావు నిర్మించిన ఛాలెంజ్, కే.మురళీ మోహన్ రావు దర్శకత్వం వహించిన కొదమ సింహం వంటి సినిమాలు వరుణ్ తేజ్ ఇప్పటి ట్రెండ్‌కు తగ్గట్టు రీమేక్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.