10 రూపాయిల ఖర్చుతో మోకాళ్ళ నొప్పులు,కీళ్ల నొప్పులు,నడుము నొప్పి అన్ని నిమిషంలో మాయం
Knee Pain In telugu :ఈ రోజుల్లో వయస్సుతో సంబందం లేకుండా ప్రతి ఒక్కరూ మోకాళ్ళ నొప్పులు,కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారు. ఒకప్పుడు 60 సంవత్సరాలు వచ్చాక మోకాళ్ళ నొప్పులు వచ్చేవి. కానీ ఇప్పుడు 30 నుంచి 35 సంవత్సరాలు వచ్చేసరికి నొప్పులు వచ్చేస్తున్నాయి.
ఇలా చిన్న వయస్సులో నొప్పులు రావటంతో అందరూ చాలా కంగారూ పడిపోతు ఉంటారు. అలా కంగారూ పడవలసిన అవసరం లేదు. సమస్య ప్రారంభంలో ఉన్నప్పుడే కొన్ని ఇంటి చిట్కాలను పాటిస్తే సమస్య నుండి తేలికగా బయట పడవచ్చు. దీనికి కేవలం రెండే రెండు ఇంగ్రిడియన్స్ సరిపోతాయి.
ఒక స్పూన్ ఆవనూనెలో ఒక స్పూన్ శొంఠి పొడి వేసి బాగా కలిపి నొప్పి ఉన్న ప్రాంతంలో రాసి ఒక క్లాత్ చుట్టి మరుసటి రోజు ఉదయం గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా 10 రోజులు చేస్తే నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది. శొంఠి పొడి మార్కెట్ లో లభ్యం అవుతుంది.
అలా కాకుండా ఇంటిలో కూడా తయారుచేసుకోవచ్చు. శొంఠి కొమ్ములను తెచ్చుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పాన్ లో వేసి కొంచెం నూనె వేసి వేగించి…కాస్త చల్లారాక మిక్సీలో వేసి మెత్తని పొడిగా చేసుకోవాలి. శొంఠి పొడిని ఒక గ్లాసు గోరువెచ్చని పాలు లేదా నీటిలో కలిపి తాగిన మంచి ప్రయోజనం కనపడుతుంది.
ఆవనూనె నొప్పులను తగ్గించటానికి పురాతన కాలం నుండి వాడుతున్నారు. ఆవనూనె చర్మం లోపలకు చొచ్చుకొని పోయి నొప్పులను తగ్గిస్తుంది. ఆవనూనెలో ఒమెగా3 ఫ్లాటీ యాసిడ్ కూడా ఎక్కువగా ఉండటంతో నొప్పిని కలిగించే ఇన్ఫమేషన్ తగ్గించటానికి సహాయపడుతుంది. కాబట్టి ఈ రెమిడీ ని ఫాలో అవ్వండి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.