MoviesTollywood news in telugu

అర్జున్ రెడ్డిని రిజెక్ట్ చేసిన హీరోలు…ఎన్ని కోట్ల లాభమో…!?

Arjun Reddy Full Movie Youtube :తెలుగులోనే కాదు అన్ని భాషల్లో హిట్ కొట్టిన అర్జున్ రెడ్డి మూవీని తెలుగులో విజయ్ దేవరకొండ చేసాడు. సందీప్ వంగా తయారుచేసుకున్న కథతో తానే డైరెక్టర్ గా తెలుగులో కొత్తగా అర్జున్ రెడ్డిని తెరకెక్కించాడు. అల్లు అర్జున్ ద్వారా ఈ సినిమా చేయాలన్నది మొదట్లో సందీప్ కోరిక. కానీ ఈ కథను అతడు ఒప్పుకోవడం కష్టమని సన్నిహితుల ద్వారా తెలుసుకుని, సరైన హీరో కోసం వెతుకుతూ హీరో శర్వానంద్ దగ్గరకు వెళ్లి కథ చెప్పాడు.

కథ విన్నాక తెగ మెచ్చేసుకున్న శర్వానంద్ తనవలన ఇది సాధ్యంకాదని చెప్పేసాడు. పైగా బోల్డ్ సీన్స్ ఎక్కువ ఉండడంతో కొత్త హీరో అయితేనే బెటర్ అని అప్పుడే ఇండస్ట్రీకి వస్తున్న విజయ్ దేవరకొండపై చూపు పడింది. అర్జున్ రెడ్డి అనుకుని పరకాయ ప్రవేశం చేసి,ఈ పాత్ర చేయాలని డైరెక్టర్ బాగా మోటివేట్ చేసాడు. ఇక హాట్ హాట్ సీన్స్ లో షాలిని రియల్ గా నటించింది. తర్వాత చాలా కథనాలు వచ్చినా,సినిమాలో లీనమై, లవర్స్ లా ఉన్నామని విజయ్ దేవరకొండ క్లారిటీ ఇచ్చాడు.

కేవలం ఆరుకోట్ల లోపులోనే బడ్జెట్ ముగించేశారు. వివేక్ సాగర్ మ్యూజిక్ అదరగొట్టేసాడు. పోస్టర్, ట్రైలర్,టీజర్ తో యూత్ లో మంచి పబ్లిసిటీ వచ్చేసింది. కలెక్షన్స్ వర్షం 50కోట్లకు చేర్చేసింది. బోల్డ్ సీన్స్ లో, ఎమోషన్ లో,డిప్రెషన్ లో ఇలా అన్నిచోట్లా అర్జున్ రెడ్డి అదరగొట్టేయడంతో యూత్ బాగా కనెక్ట్ అయ్యారు. బోల్డ్ సీన్స్ పై రచ్చ రచ్చ అయింది.

తెలంగాణ కాంగ్రెస్ నేత వి హనుమంతరావు ఈ సినిమా ముద్దు సీన్ పోస్టర్ చించేసి రచ్చ చేసారు. ఈ సినిమా వివాదం కూడా అలుముకుంది. అయితే ఈ మూవీతో రాత్రికి రాత్రి స్టార్ హీరో అయిపోయాడు. కౌంటర్లు ఇస్తూ,నిర్మాతలను లైన్ లో నిలబెట్టాడు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."