కార్తీక దీపం సీరియల్ శౌర్య సంపాదన ఎంతో తెలుసా?
Karthika Deepam Serial Shourya : బుల్లితెర సీరియల్స్ లో కార్తీక దీపం సీరియల్ కి గల క్రేజ్ మామూలు రేంజ్ లో లేదు. ఇందులో నటిస్తున్న నటీనటులందరూ ఆడియన్స్ నుంచి మంచి గుర్తింపు పొందుతున్నారు. ఇక శౌర్య పాత్రలో నటిస్తున్న అమ్మాయి పూర్తి పేరు బేబీ కృతిక. 2009ఆగస్టు 20న తెలెంగాణాలోని వరంగల్ లో జన్మించిన శౌర్య కి ప్రస్తుతం 12ఏళ్ళు నిండబోతున్నాయి.
హైదరాబాద్ ఇంటర్నేషనల్ స్కూల్ లో లో చదువుతున్న శౌర్య తల్లిపేరు స్వప్న , తండ్రి పేరు వంశీకృష్ణ. ఐదేళ్ల వయస్సులో గీతాంజలి సీరియల్ లో చైల్డ్ ఆర్టిస్టుగా అన్నపూర్ణ స్టూడియాలో నటించింది. అక్కమొగుడు, బావామరదలు సీరియల్స్ లో నటించినప్పటికీ పెద్దగా పేరు రాలేదు. కానీ కార్తీక దీపం సీరియల్ తో మంచి క్రేజ్ వచ్చేసింది. సూపర్ స్టార్ మహేష్ బాబుతో కల్సి సరిలేరు నీకెవ్వరూ మూవీలో నటించింది.
శౌర్య 4అడుగుల ఆరు అంగుళాల ఎత్తులో ఉంటుంది. 37కిలోల బరువు. ప్రభాస్ అంటే ఈమెకు చాలా ఇష్టమైన హీరో. సమంత అంటే చాలా ఇష్టమట. హైదరాబాద్ అంటే ఎంతో ఇష్టపడే ఈమెకు ఐస్ క్రీమ్ అంటే ఇష్టమట. డాన్స్, టివి చూడడం హాబీస్. ఒక్కో ఎపిసోడ్ కి బానే ముడుతుందట. శౌర్య ఫాదర్ దగ్గర స్విఫ్ట్ కారుంది. హైటెక్ సిటీలో ఓ అపార్ట్మెంట్ లో రెంట్ కి ఉంటున్నారు.