MoviesTollywood news in telugu

అలియా భట్ కోసం జక్కన్న అలా చేస్తున్నాడా…నిజమా…!?

RRR Movie Alia Bhatt :మిగతా డైరెక్టర్స్ కి దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కి చాలా తేడా ఉంది. పక్కా స్క్రిప్ట్ తో షూటింగ్ స్టార్ట్ చేసే జక్కన్న ఎక్కడా డీవియేషన్ అవ్వడం ఉండదు. పాత్ర పరిధిని పెంచడం లేదా తగ్గించడం రాజమౌళి సినిమాల్లో ఎప్పుడూ జరగదు. బాహుబలి రెండు పార్టుల తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా మల్టీస్టారర్ మూవీ ఆర్ ఆర్ ఆర్ తెరకెక్కిస్తున్న సంగతి తెల్సిందే.

ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ మూవీ క్లైమాక్స్ సీన్స్ షూటింగ్ జరుగుతోంది. బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ ఈ మూవీలో సీత పాత్రలో నటిస్తుండగా, కొన్ని రోజుల క్రితం అలియా పుట్టినరోజు కానుకగా సీత పాత్రలో అలియా లుక్ విడుదల కాగా ఆ లుక్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. దీంతో అలియా భట్ తెలుగమ్మాయి గా నమ్మించేలా చేయడంలో రాజమౌళి బాగానే విజయం సాధించారు. ఆచార్య సినిమాలో పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తి చేసుకున్న చరణ్ ప్రస్తుతం అలియా భట్ తో కల్సి పాల్గొంటున్నారట.

అలియా నటన అద్భుతంగా ఉండటం, సీత పాత్ర కోసం అలియా కష్టపడిన తీరును చూసి రాజమౌళి ఆమె పాత్ర పరిధిని పెంచాలని భావిస్తున్నారట. నిజానికి రాజమౌళి గతంలో హీరోయిన్ల పాత్రల పరిధి పెంచినట్టు ఎప్పుడూ వార్తలు రాలేదు. అలియా సినిమాలో నటించిన సన్నివేశాలు చాలా బాగా వచ్చాయని తెలుస్తోంది. నటన విషయంలో చరణ్, ఎన్టీఆర్ లకు పోటీ ఇచ్చే విధంగా అలియా నటించడంతో, ఎప్పుడూ స్క్రిప్ట్ పరిధి దాటని జక్కన్న ఈ మూవీలో అలియా భట్ పాత్ర పరిధిని పెంచినట్టు టాక్ వైరల్ గా మారింది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."