MoviesTollywood news in telugu

డిజాస్టర్ అవుతున్నా ఆఫర్లు తెచ్చుకుంటున్న హీరోలు…కారణం ఇదే

Raj Tarun And Aadi :సాధారణంగా తెలుగు ఇండస్ట్రీలో వరుస హిట్స్ వస్తే ఆకాశానికి ఎత్తేయడం, సినిమాల కోసం క్యూలో నిలుచోవడం , అదే ప్లాప్ అయితే అటువైపు కన్నెత్తి చూడకపోవడం జరుగుతూ ఉంటుంది. పెద్ద పెద్ద స్టార్ హీరోలే ఇలాంటి ఘటనలు ఎన్నో ఎదుర్కొన్నారు. అయితే వర్ధమాన హీరోలు ఆది సాయికుమార్, రాజ్ తరుణ్ ల సినిమాలు ప్లాప్ అవుతున్నా ఆఫర్లు మాత్రం వచ్చేస్తున్నాయి.

ఆది హీరోగా అట్టహాసంగా శుక్రవారం వచ్చిన శశి మూవీ డిజాస్టర్ అయింది. ఇందులో చంద్రబోస్ రాసిన ‘ఒకే ఒక లోకం నువ్వు ‘ సాంగ్ మంచి హైప్ తెచ్చింది. కానీ సినిమా ఆకట్టుకోలేదు. అలాగే ఈనెల 5న రాజ్ తరుణ్ మూవీ ‘పవర్ ప్లే ‘ మూవీ రిలీజై డిజాస్టర్ గానే మిగిలింది. అయినా ఈ హీరోలకు ఆఫర్లు వస్తున్నాయి. సినిమాలు తీయడానికి ప్రొడ్యూసర్లు రెడీగా ఉంటున్నారు.

నిజానికి సాయికుమార్ కొడుకు ఆది మొదటి సినిమాతోనే తనలోని టాలెంట్ ప్రూవ్ చేసుకున్నాడు. అలాగే ఉయ్యాలా జంపాల తొలిమూవీతోనే రాజ్ తరుణ్ తానేమిటో చాటిచెప్పాడు. వీళ్ళ సినిమాలు ఆడకపోయినా , నటులుగా తమ సత్తా చాటుకున్న వీళ్ళతో సినిమాలు తక్కువ బడ్జెట్ లో తీస్తే ఎలాంటి రిస్క్ ఉండదని ప్రొడ్యూసర్లు భావిస్తున్నారట. అలాగే శాటిలైట్ రైట్స్,డిజిటల్ రైట్స్ రూపంలో కూడా కలెక్షన్ బాగానే ఉంటుంది.

అందుకే ప్లాప్ లు వస్తున్నా ఆఫర్లు ఆగడం లేదు. ప్రస్తుతం అది చేతిలో రెండు సినిమాలు,రాజ్ తరుణ్ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి.