MoviesTollywood news in telugu

సావిత్రమ్మ గారబ్బాయి సీరియల్ నుంచి తప్పుకున్న హీరో…కారణం ఇదేనట

savitramma gari abbayi serial balaraju :ప్రస్తుతం బుల్లితెరపై సావిత్రమ్మ గారబ్బాయి సీరియల్ మంచి ప్రేక్షాదరణతో నడుస్తోంది. మైనా నిజ స్వరూపం ఎప్పుడు తెలుస్తుంది. బాలరాజు , నందిని ఎప్పుడు కలుస్తారు అని ఈ సీరియల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ ఎదురుచూస్తున్నారు. హీరో బాలరాజు కన్నడ నటుడైనా తెలుగులో తన నటనతో ఎంతోమంది ఫాన్స్ ని సంపాదించుకున్నాడు.

యాక్షన్ కింగ్ అర్జున్ కూతురు ఐశ్వర్యంతో కల్సి తొలిసారి గా కన్నడ ఇండస్ట్రీలో హీరోగా ఎంట్రీ ఇచ్చిన బాలరాజు అసలుపేరు చందనకుమార్. ఆతర్వాత కొన్ని సినిమాల్లో చేసినా తగిన గుర్తింపు రాకపోవడంతో బిగ్ బాస్ షోలో ఎంట్రీ ఇచ్చి రన్నరప్ అయ్యాడు. కన్నడలో అగ్నిసాక్షి సీరియల్ లో ఐశ్వర్యతో కల్సి నటించాడు. ఇదే సీరియల్ తెలుగులో అర్జున్ అంబటి, ఐశ్వర్య నటించారు.

ఇక సావిత్రమ్మ గారబ్బాయి సీరియల్ లో ఎంట్రీ ఇచ్చిన బాలరాజు సడన్ గా తప్పుకున్నాడు. రెండు సంవత్సరాలకు 500ఎపిసోడ్స్ కి ఒప్పందం ముగియడంతో తప్పుకున్నానని, తన ప్లేస్ లో బాలాదిత్య వస్తున్నాడని చందనకుమార్ క్లారిటీ ఇచ్చాడు. అతడిని కూడా ఆదరించాలని కోరాడు. ఈ సీరియల్ లో నటిస్తున్నప్పుడు అందరూ ఎంతో సహకరించారని చెప్పాడు. అయితే ఈమధ్య బెంగళూరులో చందనకుమార్ ప్రారంభించిన రెస్టారెంట్ కూడా బాగా ఆదరణకు నోచుకుంటోందట. కన్నడలో ఒక సినిమా చేస్తున్నాడు.అదే తెలుగులో కూడా రీమేక్ అవుతుందని చెప్పాడు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."