MoviesTollywood news in telugu

మిగిలిన యాంకర్స్ కి షాకిస్తున్న అనసూయ…ఏమిటో చూడండి

Anchor Anasuya Bharadwaj :జబర్దస్త్ తో పాపులార్టీ తెచ్చుకున్న అనసూయ బుల్లితెర యాంకర్ గా తనకంటూ ఓ ఇమేజ్ తెచ్చుకుంది. అలాగే సినిమాల్లో ఛాన్స్ లు కొట్టేస్తూ బుల్లితెర మీద, వెండితెర మీద తన సత్తా చాటుతోంది. మిగిలిన యాంకర్లతో పోలిస్తే, సినిమాల్లో అనసూయకు మాత్రమే ఎక్కువ ఆఫర్లు వస్తున్నాయి. ముఖ్యంగా సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేస్తూ ఒక్కో సాంగ్ కు పది లక్షల కన్నా ఎక్కువ రెమ్యునరేషన్ అంటుకుంటున్నట్లు టాక్.

అనసూయ తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా బ్రాండ్ ఉత్పత్తులైన ట్రెండీ శారీలకు అనసూయ ప్రమోషన్స్ చేస్తూ , అదనపు సంపాదన చేస్తోంది. స్టార్ హీరోయిన్ల మాదిరిగా ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు షాపింగ్స్ మాల్స్ ఓపెనింగ్ లతో, బ్రాండ్ ఎండోర్స్ మెంట్లతో పాటు టివి షోస్ తో కూడా అనసూయ తన రేంజ్, సంపాదన పెంచుకుంటోంది. ఇలా తోటి యాంకర్స్ కు షాక్ ఇస్తోంది. ఎందుకంటే, పెద్దపెద్ద స్టార్స్ మాత్రమే బ్రాండ్ ప్రమోషన్స్ తో డబ్బులు సంపాదిస్తుంటే అనసూయ కూడా ఆ జాబితాలో చేరడం మామూలు విషయం కాదు.

ఇక సినిమాల్లో వరుస ఆఫర్స్ వస్తున్న కొన్ని ఒకే చేయడం లేదు. ఎన్ని ఆఫర్లు ఉన్నా అనసూయ జబర్దస్త్ షోకు మాత్రం ప్రాధాన్యతనిస్తూనే అందులో భాగంగానే మహాస ముద్రం సినిమాలో కూడా అనసూయకు స్పెషల్ సాంగ్ ఆఫర్ వచ్చినా ఇంకా ఒకే చెప్పలేదని టాక్. ప్రస్తుతం రంగమార్తాండ, ఖిలాడీ సినిమాలలో చేస్తున్న అనసూయ ఈ సినిమాల హిట్స్ కొడితే, మరిన్ని ఆఫర్స్ వస్తాయని అంటున్నారు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."