కీర్తి సురేష్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో తెలుసా…ఎన్ని కోట్ల అస్థి…?
Telugu Actress Keerthy Suresh :మహానటి మూవీతో అచ్చం సావిత్రిలా నటించి అశేష ప్రేక్షకాదరణ పొందిన స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ ప్రస్తుతం నితిన్ తో రంగ్ దే సినిమాలో చేసింది. ఇక మెగాస్టార్ నటిస్తున్న ఆచార్య మూవీలో, అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సర్కారువారి పాట మూవీలో నటిస్తోంది. ఈమెని ఇంట్లో కీర్తన , బేబీ డాల్ అని పిలుస్తారు. తమిళనాడులోని చెన్నైలో 1992అక్టోబర్ 17న జన్మించిన కీర్తికి ప్రస్తుతం 29ఏళ్ళు పూర్తవుతాయి. మలయాళం ఫిలిం ప్రోడ్యుసర్ సురేష్ కుమార్,నటి మేనక ఈమె పేరెంట్స్ .ఈమెకు రేవతి సురేష్ అనే సిస్టర్ ఉంది.
కేరళ తిరువనంతపురం కేంద్రీయ విద్యాలయం, తమిళనాడు పారెల్ కాలేజీలో చదివింది. ఫ్యాషన్ డిజైన్ లో బిఎ పూర్తిచేసింది. ఇక చైల్డ్ ఆర్టిస్టుగా మలయాళంలో 2000లో ఎంట్రీ ఇచ్చిన ఈమె పలు సినిమాల్లో నటించింది. తర్వాత స్టడీస్ మీద దృష్టి పెట్టింది. స్టడీస్ పూర్తయ్యాక 2013లో గీతాంజలి మలయాళం మూవీలో చేసి 37లక్షల 60వేలు రెమ్యూనరేషన్ తీసుకుంది. 2014లో రింగ్ మాస్టర్ అనే మూవీలో కూడా నటించింది. ఇక టాలీవుడ్ లో 2016లో రెమో మూవీతో ఎంట్రీ ఇచ్చింది. నేను శైలజ, నేను లోకల్ నటించిన కీర్తి సురేష్ 2018లో మహానటితో పాపులర్ అయింది.
ఈ సినిమాకు 2కోట్ల 80లక్షలు తీసుకుంది. ఆతర్వాత పవన్ తో కల్సి అజ్ఞాతవాసి లో నటించింది. 2020లో మిస్ ఇండియా ఇలా పలు హిట్ మూవీస్ లో చేసింది. నితిన్ మూవీలో రెండు కోట్లు తీసుకుంది. త్రివేండ్రంలో నివాసం ఉంటోంది. ఆ ఇంటి ఖరీదు 12నుంచి 15కోట్లు ఉంటుంది. ఈమెకు రెండు అధునాతన సౌకర్యాలు గల కార్లున్నాయి. ఈమెకు తమిళ నటులు విజయ్, సూర్య, హీరోయిన్ విద్యాబాలన్ అంటే ఇష్టమైన నటులు. పిజ్జా,ఐస్ క్రీమ్,ఓనం అంటే ఇష్టం.

