కెజిఎఫ్ సీక్వెల్ రెమ్యునరేషన్స్ పై వైరల్ న్యూస్
KGF Chapter 2 remunerations :కన్నడ నటుడు యష్ ని ఓవర్ నైట్ స్టార్ హీరోగా చేసిన కెజిఎఫ్ అన్ని భాషల్లో సంచలనం సృష్టించి పాన్ ఇండియా మూవీగా కలెక్షన్స్ వర్షం కూడా కురిపించింది. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో కెజిఎఫ్ కి సీక్వెల్ గా కెజిఎఫ్ 2కూడా రెడీ అవుతోంది. ఈ మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. భారీ తారాగణంతో భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా తీస్తున్నారు. ఇప్పటికే ట్రైలర్ 100మిలియన్స్ వీక్షకులను దాటి, యూట్యూబ్ రికార్డ్స్ లో కొత్త అధ్యాయం క్రియేట్ చేసింది.
యష్ ఈ మూవీలో రాకీభాయ్ గా మెయిన్ లీడ్ చేస్తున్నాడు. ఇందుకోసం 40కోట్లు రెమ్యునరేషన్ గా అందుకుంటున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇందులో మెయిన్ విలన్ గా సంజయ్ దత్ చేస్తున్నాడు. 1981లో కెరీర్ స్టార్ట్ చేసిన బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కి ఇప్పుడు 62ఏళ్ళు. ఎన్నో హిట్ మూవీస్ లో హీరోగా చేసిన సంజయ్ ఇప్పుడు విలన్ అవతారం ఎత్తి కోట్లు అందుకుంటున్నాడు. ఇందులో సంజయ్ నటనకు 12కోట్లు ఇస్తున్నట్లు టాక్.
భారత ప్రధానమంత్రి క్యారెక్టర్ చేస్తున్న రవీనా టాండన్ 47ఏళ్ళు పూర్తిచేసుకుంటోంది. ఇందులో నటిస్తున్నందుకు 80లక్షలు ముట్టజెబుతున్నారని టాక్. మరో నటి రీనా అసలు పేరు శ్రీనిధి శెట్టి. కర్ణాటకలో జన్మించిన ఈమె బీటెక్ చేసింది. 29ఏళ్ళ రీనా 2కోట్ల 80లక్షలు అందుకుతున్నట్లు టాక్. రాకీభాయ్ మదర్ క్యారెక్టర్ పండించిన అర్చనా జాయిస్ కేరళలో జన్మించింది. ఈమెకు 27ఏళ్ళు. మోడల్ గా సీరియల్ యాక్టర్ గా చేస్తూ కెజిఎఫ్ లో నటించి తొలిసినిమాతోనే ఎనలేని క్రేజ్ తెచ్చుకుంది. 70లక్షలు రెమ్యునరేషన్ గా ఇస్తున్నట్లు తెలిసింది.

