ఇండస్ట్రీలో మరో విషాదం..ప్రముఖ నటి భర్తను మింగేసిన కరోనా
Malashri Husband :కరోనా చిన్న పెద్ద పేద ధనిక తేడా లేకుండా అందరినీ చుట్టేస్తుంది ఈ మాయదారి కరోనా కారణంగా సినీ నిర్మాత నటి మాలాశ్రీ భర్త రాము మరణించారు గత మూడు రోజులుగా కరొనాతో బాధపడుతున్న ఆయన సోమవారం సాయంత్రం తుది శ్వాస విడిచారు.
కన్నడ పరిశ్రమలో కోటిరాముగా పేరుతెచ్చున్న రాము ఏకే 47, లాకప్‌డెత్, కలాసిపాళ్య లాంటి బ్లాక్‌బస్టర్ సినిమాలను నిర్మించి సక్సెఫుల్ నిర్మాతగా కన్నడలో మంచి పేరుతెచ్చున్నారు. గత వారం అనారోగ్యంగా ఉండటంతో టెస్ట్ చేయించుకుంటే కోవిడ్ నిర్ధారణ అయింది.
కాగా శుక్రవారం నాటి నుంచి ఆరోగ్య పరిస్థితి బాలేకపోవడంతో బెంగళూరులోని ఎంఎస్ రామయ్య ఆసుపత్రిలో చేరారు. కాగా సోమవారం సాయంత్రం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ కన్నుమూశారు.
తెలుగు, కన్నడ, తమిళ భాషలలో స్టార్ హీరోయిన్గా పేరుతెచ్చుకున్న మాలాశ్రీని పెళ్లి చేసుకున్నారు రాము. ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. రాము మరణ వార్తతో కన్నడ పరిశ్రమలో విషాదఛాయలు అలముకున్నారు.

