MoviesTollywood news in telugu

నెంబర్ వన్ కోడలు వాగ్దేవి క్యారెక్టర్ ని ఎంత మంది రిజెక్ట్ చేశారో…?

No 1 Kodalu Daily Serial :జి తెలుగులో ప్రసారమవుతున్న నెంబర్ వన్ కోడలు సీరియల్ జనాన్ని విపరీతంగా ఆకట్టుకుంటోంది. పాపులార్టీ బాగా తెచ్చుకుంది. ఇందులో వాగ్దేవి పాత్ర తో ఆకట్టుకుంటున్న సుధా చంద్రన్ మంచి క్లాసికల్ డాన్సర్. కృత్రిమ కాలుతో మయూరి సినిమాలో యాక్ట్ చేసి నేషనల్ అవార్డు సొంతం చేసుకుంది. ఇక ఎన్నో వందల షోస్ చేసింది. 16ఏళ్ల వయస్సులోనే ఓ ప్రమాదంలో కాలు పోగొట్టుకున్న సుధా చంద్రన్ ఇప్పుడు జయపూర్ కాలుతో నడుస్తోంది.

ఎన్నో సీరియల్స్ లో నటించినప్పటికీ తెలుగులో తొలిసిరియల్ ఇదే. ఓ అత్తగా,ఓ తల్లిగా, తన నటనతో అందరినీ అలరిస్తోంది. ఈమెను ఈ పాత్ర కోసం సెలెక్ట్ చేయడానికి ముందు ముగ్గరు పాపులర్ స్టార్స్ ని రిజెక్ట్ చేశారట. అందులో హరిత ఒకరు. ఈమె ముద్దమందారం లో అఖిలాండేశ్వరి పాత్రతో ఆకట్టుకుంది. సావిత్రిగారి అబ్బాయి సీరియల్ చేస్తోంది. ఒక అక్కగా, అత్తగా మంచి క్రేజ్ ఉంది. కుంకుమ పువ్వు సీరియల్ లో కూడా చేయడమే కాకుండా పలు భాషల్లో చేసింది.

సంఘర్షణ సీరియల్ ద్వారా తెలుగు బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చిన హరిత, కలవారి కోడళ్ళు, వైదేహి, మనసు, ముద్దమందారం, కుంకుమ పువ్వు, చక్రవాకం, మొగలిరేకులు, నా కోడలు బంగారం, సావిత్రమ్మ గారబ్బాయి, వంటి సీరియల్స్ లో నటించింది. ఆ తర్వాత త్రినయని సీరియల్ లో నటిస్తున్న పవిత్ర జైన్ తన నటనతో ఆకట్టుకుంటూ మంచి ఫాలోయింగ్ తెచ్చుకుంటోంది. నిన్నే పెళ్లాడతా సీరియల్ లో నటించింది. మేఘరామి రాధమ్మ కూతురు మూవీలో అప్సర కు తల్లిగా నటిస్తోంది. ఈ ముగ్గురు కూడా నెంబర్ వన్ కోడలు వాగ్దేవి క్యారెక్టర్ ని రిజెక్ట్ చేశారు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."