MoviesTollywood news in telugu

ఈ స్టార్ యాంకర్స్ ఏ గ్రామం నుంచి వచ్చారో తెలుసా?

Star anchors Villages :టివి రంగం విస్తృతమయ్యాక సీరియల్స్ తో పాటు వివిధ రకాల షోస్, రియాల్టీ షోస్ వచ్చాయి. ఇంకా వస్తున్నాయి. అయితే ఈ ప్రోగ్రామ్స్ కారణంగా యాంకర్స్ కూడా పుట్టుకొచ్చారు. అందులో అగ్రశ్రేణిలో  సుమ,ఝాన్సీ, ఉదయబాను, తర్వాత  అనసూయ, రష్మీ ఇలా చెప్పుకుంటూ పొతే చాలామంది  యాంకర్లు వచ్చి ఎవరి రేంజ్ లో వాళ్ళు  గుర్తింపు పొందారు. హైదరాబాద్ లో సెటిల్ అయ్యారు. అయితే ఈ యాంకర్స్ ఎక్కడ  పుట్టారో, వారి వివరాలేమిటో అనే విషయాల్లోకి వెళ్తే, ముందుగా సుమ గురించి ప్రస్తావించాలి. కేరళ కు చెందిన ఈమె తెలుగు అబ్బాయి రాజీవ్ కనకాలను పెళ్ళాడి చాలా కాలం నుండి హైదరాబాద్ లో స్థిరపడింది.
యాంకర్ ఉదయభాను తెలంగాణ లోని  కరీంనగర్ జిల్లా, సుల్తానాబాద్ నుండి బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చింది.   సీనియర్ యాంకర్ ఝాన్సీ అయితే  హైదరాబాద్ లోనే పుట్టి పెరిగింది. గ్లామర్ యాంకర్ శ్రీముఖి  నిజామాబాద్ కు చెందింది. సీనియర్ యాంకర్ శ్యామల ఆంధ్ర ప్రదేశ్ కాకినాడలో జన్మించింది. ప్రస్తుతం ఆమె కూడా హైదరాబాద్ లో సెటిలయింది. ప్రస్తుతం బుల్లితెర లో తన గ్లామర్ తో ఆకట్టుకుంటున్న వర్షిణి తమిళ నాడుకు చెందినప్పటికీ  తన కుటుంబంతో పాటు హైదరాబాద్ లోనే ఉంటోంది.
గ్లామర్ యాంకర్ విష్ణు ప్రియ సొంత ఊరు ప్రకాశం జిల్లా. ఇక వాళ్ళ నాన్న ఉద్యోగం కోసం చిన్నప్పుడే హైదరాబాద్ కి రావడంతో అక్కడే సెటిల్ అయ్యారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన  యాంకర్ మంజూష  ప్రస్తుతం హైదరాబాదులో నివాసం ఉంటోంది. యాంకర్ అనసూయ  తెలంగాణ లోని నల్గొండ జిల్లా పోచంపల్లి గ్రామం నుంచి వచ్చింది. తండ్రి తెలంగాణా అయినా,  తల్లిది కర్ణాటకలోని రాయచూర్ ప్రాంతం. యాంకర్ గా వచ్చి, ప్రస్తుతం అనసూయ హైదరాబాద్ లోనే సెటిలయింది. గ్లామర్ బ్యూటీ రష్మీ గౌతమ్ ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నం లో జన్మించింది. అయితే ఆమె తండ్రి ఉత్తర ప్రదేశ్,  తల్లి ఒడిస్సా రాష్ట్రానికి చెందిన వాళ్లు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."