రమేష్ బాబు సాహస యాత్ర సినిమా ఆగిపోవటానికి కారణం ఎవరు ?
Ramesh babu Sahasa Yatra Movie :సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా సామ్రాట్ మూవీతో టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన పెద్ద కొడుకు రమేష్ బాబు ఆతర్వాత బజారు రౌడీ, ముగ్గురు కొడుకులు వంటి హిట్ మూవీస్ లో చేసాడు. అయితే ఆతర్వాత మూవీస్ ప్లాప్ కావడంతో ఎన్ కౌంటర్ మూవీ తర్వాత నటించడం మానేసాడు. అయితే మధ్యలో ఆగిపోయిన సినిమాలు కొన్ని ఉన్నాయి. అందులో ప్రధానంగా సాహస యాత్ర మూవీ ఒకటి. అండమాన్ నికోబర్ దీవుల్లో రెండు పాటలు, సన్నివేశాలు తీశారు. ఇద్దరు డైరెక్టర్స్ మారారు.
ఈ సినిమాకు మొదట డైరెక్టర్ గా వంశీ పనిచేసాడు. రచయిత సాయినాధ్ తో కల్సి పూర్తి ఎడ్వాంచర్మూవీగా స్టోరీ లైన్ అరకులో రూపొందించారు. మబ్బు చంద్రశేఖర్ రెడ్డి సమర్పణలో నూరా రవీంద్ర రెడ్డి, టీవీఎస్ రెడ్డి, నిర్మాతలుగా ముందుకు వచ్చారు. కృష్ణకు కథ ఒకే కావడంతో రమేష్ బాబుతో 1987లో జనవరి 30న మద్రాసు ప్రసాద్ థియేటర్ లో సిరివెన్నెల రాసిన పాటను ఇళయరాజా మ్యూజిక్ డైరెక్షన్ లో రికార్డ్ చేశారు. హీరోయిన్ సెలెక్ట్ కాలేదు. విలన్ గా అమ్రిష్ పురి ని సెలెక్ట్ చేసారు. షెడ్యూల్స్ ఖరారు అయ్యాయి. ఈలోగా ప్రొడ్యూసర్స్ కి, వంశీకి మధ్య బేధాభిప్రాయాలు వచ్చి, వంశీ పక్కకు తప్పుకున్నాడు. విషయం కృష్ణకు చెప్పడంతో కె ఎస్ ఆర్ దాస్ ని డైరెక్టర్ గా సెలక్ట్ చేసారు.
దాంతో కథ మారింది. పరుచూరి బ్రదర్స్ ఎంటర్ అయ్యారు. హీరోయిన్స్ గా గౌతమీ, మహాలక్ష్మి, రూపిణి లను సెలక్ట్ చేసారు. మ్యూజిక్ డైరెక్టర్ గా కోటి వచ్చాడు. అక్టోబర్ లో షూటింగ్ స్టార్ట్ . అండమాన్ లో రమేష్ బాబు, గౌతమీ, రమేష్, మహాలక్ష్మి మీద మొత్తం రెండు పాటలు షూట్ చేసారు. తర్వాత తలకోనలో తీయాలని అనుకున్నారు. ఆర్ధిక కారణాల వలన సినిమా ఆగిపోయింది. అప్పటికే రమేష్ కి మార్కెట్ డౌన్ కావడంతో ఫైనాన్స్ కూడా దొరకక పూర్తిగా ఆగిపోయింది. కృష్ణ ప్రొడక్షన్స్ నెలకొల్పి అర్జున్, అతిధి, వంటి మూవీస్ మహేష్ బాబు హీరోగా నిర్మించాడు. దూకుడు, ఆగడు మూవీస్ కి సమర్పకుడిగా వ్యవహరించారు.

