MoviesTollywood news in telugu

సాయిపల్లవి పేరులో మహిమ ఇదే…పేరు పెట్టటానికి కారణం ఇదేనట

Telugu Actress Sai pallavi :తనకంటూ కొన్ని రూల్స్ ఏర్పరచుకుని ఇండస్ట్రీలో స్టార్ హోదా దక్కించుకున్న సాయిపల్లవికి తెలుగులో స్టార్ హీరోల సరసన పెద్దగా ఆఫర్లు రాలేదు. అయినా సరే, సాయిపల్లవి స్టార్ హీరోయిన్ స్టేటస్ ను సొంతం చేసుకోవడంతో పాటు తన నటనతో ఫిదా చేస్తూ,ఫాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. అందుకే తెలుగు,తమిళ,మలయాళ భాషల్లో సైతం నటిగా ఆఫర్లను సాధిస్తూ విజయాలను నమోదుచేస్తున్న సాయిపల్లవి నటనతోనే కాదు డ్యాన్స్ తో సైతం మెప్పిస్తూ రౌడీ హీరోయిన్ గా మారింది.

ఇక సాయిపల్లవి నటించిన లవ్ స్టోరీ, విరాటపర్వం సినిమాలు షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి. అలాగే శ్యామ్ సింగరాయ్, మరికొన్ని సినిమాలలో సాయిపల్లవి చేస్తోంది. ఫలితాలతో సంబంధం లేకుండా సినిమా సినిమాకు సాయిపల్లవికి క్రేజ్ పెరుగుతూనే ఉంది. అదే సమయంలో ఒకవేళ సినిమా ఫ్లాప్ అయితే తన రెమ్యునరేషన్ ను సైతం సాయిపల్లవి వెనక్కు ఇచ్చేసిన సందర్భాలున్నాయి.

సాయిపల్లవి వివరాల్లోకి వెళ్తే, తల్లి రాధ నాట్యకారిణి. తండ్రి కన్నణ్ కస్టమ్స్ అధికారిగా పని చేసేవారు. ఆమె తల్లి పుట్టపర్తి సాయిబాబా భక్తురాలు కావడంతో ఆమె పేరులో సాయిని చేర్చింది. చిన్నప్పటి నుంచి సాయిపల్లవికి మ్యాథ్స్ సబ్జెక్ట్ అంటే చాలా భయం. తొలిసారి తమిళంలో ధామ్ ధూమ్ అనే సినిమాలో నటించి, ఆ తరువాత మీరాజాస్మిన్ కు క్లాస్ మేట్ గా నటించింది.

అయితే స్టడీస్ పై దృష్టి పెట్టి, జార్జియాలో మెడిసిన్ పూర్తిచేసి, మలయాళంలో తెరకెక్కిన ప్రేమమ్ సినిమాలో నటించి మంచి పేరు తెచ్చుకుంది. ఆ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఫిదా సినిమాలో నటించి టాలీవుడ్ ఆడియన్స్ ని ఫిదా చేసింది. కాగా అల్లు అర్జున్ డ్యాన్సులంటే సాయిపల్లవికి ఇష్టం. అయితే ఫిదాలో తన డ్యాన్స్ ను అల్లు అర్జున్ ప్రశంసించడం ఎప్పటికీ మరిచిపోలేనని సాయిపల్లవి ఆనందం వ్యక్తంచేసింది

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."