MoviesTollywood news in telugu

తొలి హీరోయిన్ కన్నాంబ పారితోషికం ఎంతో తెలుసా?

Telugu Heroine Pasupuleti Kannamba :చిత్తూరు వి నాగయ్య నటులలో తొలి స్టార్ హీరోగా నిలిస్తే, తొలి స్టార్ హీరోయిన్ గా పసుపులేటి కన్నాంబ నిలుస్తుంది. తమిళంలో కూడా అద్భుతంగా డబ్బింగ్ చెప్పి తనకు తానే సాటి అనిపించుకున్న కన్నాంబ ఆరోజుల్లో మద్రాసులో ఏ మూల ఏ ఆస్థి ఉందొ తెలియనంతగా సంపాదించారు. కొత్త నటీనటుల్ని ఇంట్లో పెట్టుకుని భోజన సదుపాయాలు కల్పిస్తూ తన ఇంటిని సత్రంలా మార్చేసింది. నాగయ్యతో పాటు కన్నాంబ కూడా ఎన్నో సినిమాలు తీశారు. సినిమాలు దెబ్బతిని తాము సంపాదించిన ఆస్తులు కరిగిపోతుంటే నిస్సహాయులయ్యారు.1911లో జన్మించిన కన్నాంబ తన తాతగారి ఇంట సంగీతం నేర్చుకుంది. ఆమె గళానికి ఓ ప్రత్యేకత ఉండేది.

కన్నాంబ తన 16వ యేట సీనియర్ నటి అయింది. ఓ నాటకంలో చంద్రమతి పాత్ర సరిగ్గా వేయకపోవడం గమనించి అప్పటికప్పుడు ఆపాత్రలో నటించి సెహబాష్ అనిపించుకుంది. సొంతంగా ప్రదర్శనలిచ్చే కన్నాంబను దర్శకుడు సి పుల్లయ్య సినీ పరిశ్రమకు ఆహ్వానించారు. హరిశ్చంద్ర,ద్రౌపది వస్త్రాపహరణం,కనకధార గృహలక్ష్మి వంటి సినిమాలతో బాగా పాపులర్ అయింది. ఏ పాత్ర వేస్తె అందులో లీనమవ్వడం కన్నాంబ ప్రత్యేకత. ఈమె నటనకు తమిళంలో శివాజీ గణేశన్ ఆశ్చర్యపోయాడు. ఇక తనతో పాటు నాటకరంగంలో గల కడారి నాగభూషణాన్ని పెళ్లాడిన కన్నాంబ తన ఆరాధ్య దేవత రాజ రాజేశ్వరి పేరిట సంస్థ నెలకొల్పి పలు సినిమాలు తీసింది.

ఆరోజుల్లో లక్ష రూపాయల రెమ్యునరేషన్ అందుకున్న నటి ఈమె. 30 మూవీస్ వరకూ తీస్తే, చాలావరకూ హిట్స్ . తాను సినిమాల్లో నటిస్తుంటే, భర్త సినిమాలు తీసి నష్టాలు తేవడంతో భర్తీ చేయడం కష్టమయ్యేది. సతీ సక్కుబాయి మూవీ ఆర్ధికంగా కుదుట పడేలా చేసింది. ఇక పిల్లలు లేని కన్నాంబ దంపతులు రాజేశ్వరి అనే అమ్మాయిని పెంచుకుని సి పుల్లయ్య కొడుకు సి ఎస్ రావు తో పెళ్లి చేసారు. అయితే నటి రాజసులోచన ప్రేమలో పడి కూతురుని నిర్లక్ష్యం చేస్తున్నాడని తెల్సి, రాజసులోచనను పిలిచి ఆశీర్వదించి పంపింది . తర్వాత తన కూతురుకి వేరే పెళ్లి చేసింది. ఇక ఆతర్వాత సీఎస్ రావు, రాజసులోచన విడిపోయి నానా రభస చేసుకున్నారు. ఆసుపత్రిలోనే చికిత్స పొందుతూ కూడా సినిమాల్లో నటించిన కన్నాంబ 53వ యేట కన్నుమూసింది.