నటి గిరిజ జీవితం ఎలా ముగిసిందో తెలుసా…అసలు నమ్మలేరు
Tollywood comedian girija :తొలితరం కమెడియన్స్ లో రేలంగి వెంకట్రామయ్యకు అగ్రస్థానం ఉంది. అలాగే ఆయనతో కల్సి నటించిన నటి గిరిజకు మంచి పాపులార్టీ వచ్చింది. వీరిద్దరూ జోడీగా దాదాపు 100పైనే సినిమాల్లో నటించారు. కామెడీ పాత్రలతోనే కాదు, గయ్యాళి పాత్రల్లో కూడా మెప్పించింది. ఇక సినిమాల్లో రేలంగి ,గిరిజ జంట వెండితెరపై కనిపిస్తే ఆడియన్స్ కి పంట పండినట్లే అన్నట్లు ఉండేది.
అందుకే వీరిద్దరినీ దృష్టిలో ఉంచుకుని దర్శక నిర్మాతలు కామెడీ ట్రాక్ లు రాయించిన సందర్భాలు ఎన్నో వున్నాయట. ధర్మదేవత,పాతాళ భైరవి, నవ్వితే నవరత్నాలు, భలే రాముడు, భలే అమ్మాయిలు, భట్టి విక్రమార్క,అప్పుచేసి పప్పుకూడు ఇలా వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు ఆడియన్స్ కి కనువిందు చేసాయి. రెమ్యునరేషన్ కూడా గిరిజకు బానే వచ్చేదట. ఓ పక్క కామెడీ రోల్స్ చేస్తూనే మరోపక్క ఎన్టీఆర్,అక్కినేని, వంటి హీరోలకు జోడీగా నటించి మెప్పించింది.
ఎన్టీఆర్ తో భలే మాస్టర్, పవిత్ర హృదయాలు సినిమాలను నిర్మించింది. అయితే అవి పెద్దగా ఆడలేదు. దాంతో అప్పులపాలై ఉన్న ఇల్లు కూడా పోయి,అద్దె ఇంటికి చేరిన గిరిజ చాలా కష్టాలు అనుభవించిందని చెబుతారు. కొందరు నటీనటులు సాయం కూడా చేశారట. 17ఏళ్ళ వయస్సులో తల్లి చనిపోవడంతో సన్యాసిరాజు అనే సినిమా డైరెక్టర్ ను పెళ్లిచేసుకుంది. కాగా గిరిజ కూతురు శ్రీరంగ మలయాళంలో సలీమా పేరుతొ నటించింది. ఏమైతేనేం చివరకు కష్టాలను అనుభవిస్తూనే గిరిజ కన్నుమూసింది.

