గోరింటాకు శ్రీవల్లికి స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నకు రిలేషన్ ఏమిటి?
KavyaSri and Rashmika :స్టార్ మా ఛానల్ లో ప్రసారమయిన అన్ని సీరియల్స్ కి భిన్నంగా ప్రత్యేక ఒరవడితో గోరింటాకు సీరియల్ సాగింది. ఈ సీరియల్ మొదటి నుంచి మంచి ఆదరణతో నడిచింది. 2019నుంచి 2021వరకూ ఎన్నో ట్విస్టులతో ధారావాహికంగా సాగిన ఈ సీరియల్ టాప్ సీరియల్ గా పేరుతెచ్చుకుంది. ఇందులోని హీరో హీరోయిన్స్ నిఖిల్,కావ్యశ్రీ ఇద్దరూ కన్నడ ఇండస్ట్రీకి చెందినవాళ్ళే. అయినా తెలుగు ఆడియన్స్ బాగా ఆదరించారు.
కావ్యశ్రీ శ్రీవల్లీ క్యారెక్టర్ చేసి,అచ్చమైన తెలుగింటి అమ్మాయిలా తన నటనతో ఆకట్టుకుంది. ఈ సీరియల్ ఏకంగా హిందీలో రీమేక్ చేసారంటే ఈ సీరియల్ క్రేజ్ అర్ధం చేసుకోవచ్చు. అమ్మకు తెలియని కోయిలమ్మ సీరియల్ తో శ్రీవల్లీ ఆడియన్స్ ముందుకి రాబోతోంది. ఇక గీత గోవిందం మూవీతో టాలీవుడ్ లో తనకంటూ ఓ ఇమేజ్ తెచ్చుకుని స్టార్ హీరోయిన్ గా రష్మిక మందన్న రాణిస్తోంది.
స్టార్ హీరోల సరసన నటిస్తూ హిట్ మీద హిట్ అందుకుంటున్న రష్మిక మందన్న కు నేషనల్ క్రష్ అనే బిరుదు కూడా సొంతం చేసుకుంది. 2017డిసెంబర్ 21న రిలీజైన అంజనీపుత్ర అనే కన్నడ సినిమాలో హీరో పునీత్ రాజ్ కుమార్ సరసన రష్మిక హీరోయిన్ గా చేసింది.ఇందులో శ్రీవల్లీ నటించింది. రష్మిక, శ్రీవల్లీ చాలా సీన్స్ లో కలిసి నటించారు.

