తాజ్ మహల్ హీరోయిన్ ఇప్పుడు ఏమి చేస్తుందో తెలుసా?

Tollywood Heroine sruthi : దేనికైనా అదృష్టం కల్సి రావాలి అంటారు. అదృష్టం లేకుంటే వచ్చినట్టే వచ్చి ఛాన్స్ లు చేజారిపోతాయి. అలాంటి కోవలోకి హీరోయిన్ శృతి చేరుతుంది. ఈమెకు ఛాన్స్ లు తప్పిపోవడంతో ఇండస్ట్రీకి దూరమైంది. వివరాల్లోకి వెళ్తే, ప్రకటనల రంగంలో రాణించాలని భావించి అనుకోకుండా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ఈమె.

ముంబై పరిసరం ప్రాంతంలో పుట్టిపెరిగిన ఈమె జైన్ కాలేజీలో మాస్ మీడియా ఎడ్వార్టైజింగ్ డిగ్రీ పూర్తిచేసింది. అయితే తాజ్ మహల్ మూవీతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఈ భామకు మంచి ఆదరణ లభించింది. తన అందంతో,అభినయంతో ఆకట్టుకుంది. ఆతర్వాత తెలుగులో మళ్ళీ కనిపించలేదు. ఈమె ఇప్పుడు ఎక్కడ ఉందొ కూడా తెలియదు.

అయితే జూనియర్ ఎన్టీఆర్ తో ఓ సినిమాలో నటించే ఛాన్స్ వస్తే, కొన్ని కారణాల వలన శృతి నటించలేకపోయింది. అలాగే నాగచైతన్యతో కల్సి జోష్ మూవీలో చేసే ఛాన్స్ వచ్చినా కుదరలేదు. తాజ్ మహల్ లో హీరోయిన్ గా వేసినా రావాల్సిన గుర్తింపు రాలేదట. ఆ మధ్య ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్యూలో శృతి ఈ విషయాలు వెల్లడించింది. ప్రస్తుతం అవకాశాల కోసం ఎదురు చూస్తుంది.