Healthhealth tips in telugu

Coffee:కాఫీ తాగే అలవాటు ఉందా…ఈ శుభవార్త మీకోసమే

Coffee Benefits In telugu :ఇది నిజంగా కాఫీ తాగే వారికి శుభవార్తే! ముఖ్యంగా స్త్రీలకి! స్త్రీలు రోజుకి రెండు నుండి నాలుగు కప్పుల కాఫీ ను తాగితే డిప్రెషన్ నుంచి కొంత వరకు బయటపడవచ్చని హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు అంటున్నారు. రోజుకి రెండు నుంచి మూడు కప్పుల కాఫీ తాగే స్త్రీలలో 15 శాతం డిప్రెషన్ తగ్గినట్లు పరిశోధనలో తేలింది.

ఒక కప్పు కాఫీ త్రాగేవారిలో డిప్రెషన్ స్థాయిలలో ఎటువంటి మార్పు కనపడలేదు. అదే మూడు నుండి నాలుగు కప్పుల కాఫీ తాగే వారి విషయంలో డిప్రెషన్ విషయంలో 20 శాతం మార్పు కనపడినట్లు పరిశోధకులు చెబుతున్నారు. సుమారు 50 మంది స్త్రీల మీద సుమారు పది సంవత్సరాల పాటు వీరు పరిశోధనలు నిర్వహించారు.

అయితే కాఫీలో ఉండే కెఫైన్ లేదా కేఫినేటెడ్ డిప్రెషన్ ను తగ్గిస్తాయిన్న ఆధారాలు ఖచ్చితంగా లేవని పరిశోధకులు అంటున్నారు. కాకపొతే బాగా డిప్రెషన్ లో ఉన్న సమయంలో వేడి వేడిగా ఓ కప్పు కాఫీ తాగితే మూడ్ మారుతుందని మాత్రం స్పష్టం చేస్తున్నారు. డిప్రెషన్ కి గురైన స్త్రీలు కొన్ని సందర్బాల్లో ఆత్మహత్యకు పల్పోడే ఆలోచనలు చేస్తారు.

కాఫీ తాగే స్త్రీలలో ఈ ఆలోచనలు తగ్గుముఖం పట్టడం పరిశోధకుల దృష్టికి వచ్చింది. పురుషుల కన్నా స్త్రీలు చాలా త్వరగా డిప్రెషన్ కు గురవుతారని పరిశోధకులు అంటున్నారు. కాఫీ తాగడం వలన చురుకుగా ఉండడంతో పాటు మూడ్ మారుతుందని చెబుతున్నారు. రోజుకి రెండు నుండి నాలుగు కప్పులు మించి తాగితే ఆరోగ్యానికి హాని అని వారు స్పష్టం చేస్తున్నారు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."