MoviesTollywood news in telugu

గుండమ్మ కథ సినిమాను విడుదల చేయటానికి భయపడ్డారట…కారణం ఇదే…?

Gundamma katha Movie :ఆనాటి అగ్రనటులు,తెలుగు చిత్రసీమలో రెండుకళ్ళుగా విరాజిల్లిన ఎన్టీఆర్, ఏ ఎన్ ఆర్ నటించిన ఎస్వీ రంగారావు, సూర్యకాంతం వంటి దిగ్గజ నటులు,సావిత్రి,జమున హీరోయిన్స్ గా నటించిన గుండమ్మ కథ మూవీ అంటే ఇప్పటికీ క్రేజే. టివిలో ఈ సినిమా వస్తుంటే, జనాలు టీవీలకు అతుక్కుపోతుంటారు. ప్రసిద్ధ నిర్మాణ సంస్థ విజయా సంస్థ నిర్మించిన ఈ సినిమాకు మాటలు డివి నరసరాజు రాసారు.

అసలు దీన్ని రీమేక్ చేయాలన్న తలంపు కూడా వచ్చినా కాంబినేషన్ కుదరక కార్యరూపం దాల్చలేదు. బాలకృష్ణ, నాగార్జున, ఆతర్వాత జూనియర్ ఎన్టీఆర్, నాగచైతన్య ఇలా పలు కాంబినేషన్స్ లో గుండమ్మ కథ తీయాలని చూసినా సూర్యకాంతం పాత్ర కు ఎవరూ దొరక్క ఊరుకున్నట్లు టాక్ నడిచింది. అప్పట్లో స్టార్ హీరోలుగా ఉన్న ఎన్టీఆర్,అక్కినేని నటించిన ఈ మూవీలో ఎన్టీఆర్ నిక్కరు వేసుకుని నటించి మెప్పించారు.

తీరా సినిమా పూర్తయ్యాక ఎన్టీఆర్ ని నిక్కరులో చూస్తే జనం తిరగబడతారేమోనని విజయా సంస్థ నిర్వాహకులు భయపడ్డారట. దాంతో 10రోజుల ముందు ఇంట్లో జరిగిన ఫంక్షన్ కి హాజరైన బంధువులకు చూపిస్తే బాగుందని చెప్పడంతో రిలీజ్ చేశారట. అప్పట్లో బ్లాక్ బస్టర్ అయింది. ఈ విషయాన్ని ఇటీవల ప్రముఖ మాటల రచయిత పరుచూరి గోపాలకృష్ణ వెల్లడించారు. రచయితల సంఘానికి భీష్మాచార్యుడైన నరసరాజు సినిమాలు చాలా చూశానని, అందులో గుండమ్మ కథ ఒకటని చెప్పారు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."