MoviesTollywood news in telugu

జబర్దస్త్ నరేష్ వయసు ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

jabardasth comedian naresh : జబర్దస్త్ నరేష్ చూడటానికి మూడు అడుగుల లోపే ఉన్న సంచులు కొద్ది పంచులు వేస్తూ చిచ్చరపిడుగులా రెచ్చిపోతున్నాడు.ప్రస్తుతం బుల్లితెర మీద నరేష్ ఒక వెలుగు వెలుగుతున్నాడని చెప్పాలి. జబర్దస్త్ షో ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. నరేష్ ఏకసంతాగ్రహి అది భగవంతుడు ఇచ్చిన వరం. స్క్రిప్ట్ ఒకసారి కాన్సెప్ట్ ఏమిటి అని చూసుకుని పెర్ఫామ్ చేస్తూ ఉంటాడు స్టేజి మీద. ఈ విషయాన్ని భాస్కర్ కూడా చాలా సార్లు చెప్పాడు.

ప్రస్తుతం కొన్ని రోజులుగా జబర్దస్త్ నరేష్ వయసు గురించి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వరంగల్ జిల్లా జనగాం దగ్గర్లో అనంతపురం అనే ఊరిలో పుట్టిన నరేష్ చిన్నతనం నుండి ఎదుగుదల లోపంతో బాధపడుతున్నాడు. 10 సంవత్సరాల పిల్లవాడుగా కనిపించే నరేష్ వయస్సు 22 సంవత్సరాలు. ఢీ షో జూనియర్స్ వచ్చాడు ఆ తర్వాత అన్నపూర్ణ స్టూడియో బయట తిరుగుతూ ఉంటే సునామీ సుధాకర్ చంటి టీమ్ లో జాయిన్ చేసాడు. ఆ తర్వాత బుల్లెట్ భాస్కర్ టీమ్ లోకి వచ్చి చాలా తక్కువ సమయంలోనే స్టార్ కమెడియన్ అయిపోయాడు. జబర్దస్త్ షో కి వచ్చాక సొంత ఊరిలో ఇల్లు కట్టుకోవడమే కాకుండా సిటీ లో కూడా ఒక ఫ్లాట్ తీసుకున్నాడు.