MoviesTollywood news in telugu

చంద్రముఖి సినిమాలో ఛాన్స్ మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్

Telugu Heroine sada :కొన్ని సినిమాలు వివిధ కారణాల వలన వదిలేసుకోవడం హీరో హీరోయిన్స్ కి సహజం. అయితే ఆ సినిమా ప్లాప్ అయితే బాధ ఉండదు కానీ, హిట్ అయితే అందునా బ్లాక్ బస్టర్ అయితే అయ్యో ఛాన్స్ మిస్సయ్యామే అని ఫీలవుతారు. సరిగ్గా జయం మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన సదా విషయంలో అదే జరిగింది. తేజ డైరెక్షన్ వచ్చిన జయం మూవీలో నితిన్ సరసన సదా నటన సూపర్భ్. ఈ మూవీ బ్లాక్ బస్టర్ కావడంతో ఈ అమ్మడికి ఛాన్స్ లు వచ్చాయి.

పవన్ కళ్యాణ్,బాలకృష్ణ,జూనియర్ ఎన్టీఆర్,మంచు మనోజ్ ల సరసన నటించిన ఈ ముంబై బ్యూటీ తెలుగుతో పాటు తమిళ తదితర భాషల్లో నటిస్తోంది. ప్రస్తుతం తమిళంలో కిట్టీ పార్టీ అనే మూవీలో కీలకపాత్ర పోషిస్తున్న ఈమె ఆ మధ్య నటించిన శ్రీమతి 21ఎఫ్ మూవీతో డిజాస్టర్ అందుకుంది. అసలు ఈ మూవీ ఎప్పుడు వచ్చిందో వెళ్లిపోయిందో కూడా తెలీదు. కథల విషయంలో సరిగ్గా వ్యవహరించకపోవడంతో ఈమె ఎక్కువ డిజాస్టర్ లు చవిచూసింది.

కాగా అప్పట్లో అపరిచితుడు మూవీలో విక్రమ్ సరసన నటించి మంచి బ్లాక్ బస్టర్ అందుకున్న ఈమె కీలకమైన చంద్రముఖి మూవీ మిస్సయింది. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన చంద్రముఖి మూవీలో నయనతార హీరోయిన్ గా చేసి,ఇప్పుడు టాప్ హీరోయిన్ అయింది. నిజానికి సదాకి వచ్చిన ఛాన్స్ అనివార్య కారణాలతో వదిలేసుకొని ఆతర్వాత చాలా బాధ పడింది. ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరికి ఎలా అవుతుందో చెప్పడం కష్టమే.