MoviesTollywood news in telugu

కలిసుందాం రా సినిమాకి పోటీ వచ్చిన సినిమాల పరిస్థితి ఎలా ఉందో…?

Kalisundam Raa Movie : విక్టరీ వెంకటేష్ బెస్ట్ యాక్టర్ గా నంది అవార్డు తెచ్చిన కలిసుందాం రా మూవీ 2000 సంక్రాంతి మూవీగా వచ్చి అందరికీ నచ్చేసింది.అందుకే పాత రికార్డులను తిరగరాసింది. వెంకటేష్ కి ఇండస్ట్రీ హిట్ ఇచ్చింది. అయితే పలు సినిమాల నుంచి పోటీని కూడా తట్టుకుని నిలబడింది. రెండు కుటుంబాల మధ్య ఏర్పడిన వివాదాన్ని ప్రేమ అనే అంశం జోడించి,ఉదయ శంకర్ డైరెక్షన్ లో సున్నిత అంశగా ఈ మూవీని మూవీ మొఘల్ డాక్టర్ దగ్గుబాటి రామానాయుడు నిర్మించారు.

ప్రేమను త్యాగం చేసే పాత్రలో విక్టరీ వెంకటేష్, అతడి ప్రేమలోనే జీవించాలని హీరోయిన్ సిమ్రాన్, పగతో రగిలే పాత్రలో శ్రీహరి ఇలా ముక్కోణంలో సున్నిత అంశాలను మేళవించి తీసిన ఈ మూవీ ఫ్యామిలీ డ్రామాగా నిలిచింది.ఎస్ ఏ రాజకుమార్ సంగీతం సూపర్భ్. ఏకంగా 35 థియేటర్లలో సిల్వర్ జూబ్లీ చేసుకున్న ఈ మూవీ 20సెంటర్స్ లో 200రోజులు ఆడింది. నాలుగు నంది అవార్డులు,ఒక ఫిలిం ఫేర్ అవార్డు,ఒక నేషనల్ అవార్డు సొంతం చేసుకున్న ఈ మూవీ లో కళాతపస్వి కె విశ్వనాధ్ కీలక పాత్ర పోషించారు.

ఇక వెంకీ తన మార్క్ కామెడీ,సీరియస్ నెస్ లో జీవించాడు. ఈ సినిమాకు ఒకరోజు ముందు మోహన్ బాబు మూవీ పోస్ట్ మాన్ రిలీజయింది. ముప్పలనేని శివ డైరెక్షన్ లో మోహన్ బాబు నటించి నిర్మించిన ఈ మూవీలో సౌందర్య హీరోయిన్. రాశి మరో హీరోయిన్. ఫ్యామిలీ లవ్ అండ్ ఎమోషనల్ మూవీగా సాగిన ఈ సినిమా కు ఏవరేజ్ టాక్ వచ్చింది. కల్సిందాం రా మూవీ ప్రభంజనం ముందు ఇది ఆగలేదు.

అలాగే మెగాస్టార్ చిరంజీవి నటించిన అన్నయ్య మూవీ కూడా వెంకీ మూవీకి వారం ముందు రిలీజయింది. ముత్యాల సుబ్బయ్య డైరెక్షన్ లో జనవరి 7న వచ్చిన ఈ మూవీ బ్రదర్స్ సెంటిమెంట్ తో నడుస్తుంది. చిరంజీవి కామెడీ,యాక్షన్ బాగా పండాయి. సౌందర్య హీరోయిన్. 60సెంటర్స్ లో 100డేస్ ఆడి, మంచి విజయాన్ని అందుకుంది. మణిశర్మ మ్యూజిక్.

కల్సిందాం రా రిలీజ్ అయిన జనవరి 14నే బాలకృష్ణ నటించిన వంశోద్ధారకుడు మూవీ రిలీజయింది. ప్రేమ,ఫ్యామిలీ సెంటిమెంట్ తో ముడిపడిన ఈ మూవీకి శరత్ డైరెక్టర్. రమ్యకృష్ణ సాక్షి శివనాద్ హీరోయిన్స్. అయితే ఆశించిన స్థాయిలో విజయం దక్కలేదు. పరాజయాన్ని చవిచూసింది. ఇక గిరిజన ఆరాధ్య దేవతలు సమ్మక్క సారక్క జీవిత కథ ఆధారంగా దర్శకరత్న దాసరి నారాయణరావు విప్లవ యోధుడిగా నటించి, సొంతంగా నిర్మించి డైరెక్ట్ చేసిన మూవీ సమ్మక్క సారక్క.

తెలంగాణ ప్రజల ఆవేదన,ఆవేశం అన్నీ మేళవించి తీసిన ఈ మూవీ మంచి సక్సెస్ అందుకుంది. వందేమాతరం శ్రీనివాస్ అద్భుత బాణీలు అందించారు. జనవరి 15న వచ్చిన ఈ మూవీ తెలంగాణలో సూపర్ గా ఆడేసింది. ఇలా అన్నింటినీ తట్టుకుని వెంకీ కలిసుందాం రా మూవీ భారీ విజయాన్ని అందుకుంది.